Delhi Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం.. పార్టీలు స్పెషల్ స్కెచ్
ABN , Publish Date - Jan 20 , 2025 | 08:30 PM
Delhi Assembly Elections: దేశ రాజధాని హస్తిన అసెంబ్లీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.

న్యూఢిల్లీ, జనవరి 20: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి ఐదవ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. ఎనిమిదో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ వరుసగా అధికారం పీఠాన్ని దక్కించు కోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక కేంద్రంలోని బీజేపీ అయితే.. ఆప్ పాలనకు చరమ గీతం పాడాలంటూ పక్కా ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ సైతం మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి వేళ.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఈ మూడు పార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపే విషయంలో ప్రత్యేక పంధాని అనుసరించాయి. ఆప్, బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీలు అనుభవజ్ఞులతోపాటు యువతను రంగంలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరించనుందనే టెన్షన్.. ఢిల్లీ వాసుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తవారితోపాటు యువతకు అత్యధికంగా సీట్లు కేటాయించింది. దీంతో ఆ పార్టీలో 42 మంది అభ్యర్థుల వయస్సు 50 ఏళ్ల లోపు ఉండగా.. మరో10 మంది అభ్యర్థులు వయస్సు 25 నుంచి 39 మధ్య ఉంది. ఇక మరికొంత మంది వయస్సు మాత్రం 40 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ఇదే పంథాను అనుసరించాయి.
ఇక ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మాత్రం యువ ఓటర్లే నిర్ణయించనున్నారనేది సుస్పష్టం. ఎందుకంటే.. ఢిల్లీలో మొత్తం 1552458 మంది ఓటర్లు ఉండగా, వారిలో 44.91 శాతం మంది 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లే ఉన్నారు. అలాంటి వేళ..40 నుండి 50 ఏళ్ల వయస్సున్న ఓటర్లను కలుపుకుంటే.. అంటే 18 నుంచి 50 ఏళ్ల వయస్సున్న మొత్తం ఓటర్ల సంఖ్య 70 శాతానికి పైగా ఉండనుంది.
Also Read: వాట్సప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికేట్లు
Also Read: మౌని అమావాస్య రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..?
అలాగే ఢిల్లీలో వృద్ధులు ఉన్నా.. ఢిల్లీ సీఎం ఎవరనేది మాత్రం చెప్పేది యువతే కానుండడం గమనార్హం. మరోవైపు పలువురు సీనియర్ నేతలు.. అంటే పలుమార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు సైతం ఉన్నారు. కానీ ఈ సారి ఎన్నికల బరిలో మాత్రం వారి రాజకీయ వారసులను బరిలో నిలిపి గెలిపించుకొనేందుకు తమ వంతు ప్రయత్నాలు చేసుకొంటున్నారు. మరి ఈ ఎన్నికల్లో హస్తిన ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరికి పట్టం కట్టారనేది తెలియాలంటే మాత్రం.. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆగక తప్పదు.
Also Read: నాగ సాధువులు.. రహస్యాలు
Also Read: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. ఈ పుస్తకమే కీలకం
ఇంకోవైపు.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది మే, జూన్ మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ మహా నగరంలోని మొత్తం 7 లోక్ సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో టీడీపీ, జనసేనతో జత కట్టి బీజేపీ విజయ తీరానికి చేరింది.
Also Read: కోల్‌కతా వైద్య విద్యార్థిపై హత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు
అలాగే ఒడిశాలో సైతం బీజేపీ తన సత్తా చాటింది. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ గెలిచింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఈ కూటమే మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొంది.
Also Read: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..
జమ్ము కాశ్మీర్‌లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ విజయ కేతనం ఎగురవేసింది. అలాగే జార్ఖండ్ మాత్రం ఇండియా కూటమిలోని భాగస్వామి అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచింది. మోదీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టిన అనంతరం వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. అలాగే ఢిల్లీలో సైతం తన సత్తా చాటాలని ఆ పార్టీ నాయకత్వం దూకుడు మీద వెళ్తోంది.
For National News And Telugu News