Share News

Qatar Amir: ఖతార్ అమీర్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన మోదీ

ABN , Publish Date - Feb 17 , 2025 | 08:47 PM

ఈనెల 17,18 తేదీల్లో ఖతార్ ఆమీర్ అధికార పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈఏఎం డాక్టర్ ఎస్.జైశంకర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ అవుతారు. 18న రాష్ట్రపతి భవన్‌లో అమీర్‌కు అధికారిక స్వాగతం లభిస్తుంది.

Qatar Amir: ఖతార్ అమీర్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికిన మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతార్ అమీర్ (Qatar Amir) షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని (Sheikh Tamim Bin Hamad Al Thani) భారతదేశ పర్యటన ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఆయన పట్ల గౌరవ సూచకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానశ్రయానికి చేరుకుని సాదర స్వాగతం పలికారు. ప్రధాని వెంట విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఉన్నారు.

Mahakumbh Eknath Shinde: మహాకుంభ్‌కు శివసేన టీమ్‌తో షిండే


ఈనెల 17,18 తేదీల్లో ఖతార్ ఆమీర్ అధికార పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈఏఎం డాక్టర్ ఎస్.జైశంకర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆయన భేటీ అవుతారు. 18న రాష్ట్రపతి భవన్‌లో అమీర్‌కు అధికారిక స్వాగతం లభిస్తుంది. ఆయన గౌరవార్ధం రాష్ట్రపతి విందు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రితో చర్యలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, ప్రాంతీయ అంశాలపై ఉభయులూ చర్చిస్తారు. పలు ఎంఓయూలు కుదుర్చుకుంటారు.


ఖతార్ అమీర్ పర్యటన ఉభయదేశాల మధ్య బహుముఖ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందేందుకు దోహదపడనుందని ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఖతార్ అమీర్ వెంట మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్ వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2025 | 08:47 PM