PM Modi: ఛత్తీస్‌గఢ్ న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మోదీ
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:57 PM
ఛత్తీస్‌గఢ్‌తో తనకున్న అనుబంధాన్ని మోదీ వివరిస్తూ, తన కెరీర్‌ను మలుచుకోవడంలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఈ ఏడాది దేశానికి 'అమృత్ మహోత్సవ్' అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
రాయపుర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr BR Ambedkar) సారథ్యంలో రాజ్యాంగాన్ని రచించిన వారిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు కీలక నేతలు ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. నవ రాయపుర్ (Nava Raipur)లో నూతనంగా నిర్మించిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ భవంతిని ప్రధానమంత్రి శనివారంనాడు ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి జర్నీలో స్వర్ణయుగానికి ఇది ప్రారంభమని ఆ సందర్భంగా ఆయన అభివర్ణించారు.
ఛత్తీస్‌గఢ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రధాని వివరిస్తూ, తన కెరీర్‌ను మలుచుకోవడంలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఈ ఏడాది దేశానికి 'అమృత్ మహోత్సవ్' అని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ కలల సాకారానికి తాను సాక్షినని అన్నారు. నూతన అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
వాజ్‌పేయికి నివాళులు
ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాజ్‌పేయి విజన్ కారణంగానే 25 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ ఏర్పాటయిందని మోదీ గుర్తుచేసారు. ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందని, మాజీ ప్రధాని కలలు సాకారమయ్యాయని అన్నారు. అసెంబ్లీ కొత్త భవంతి ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్ రమణ్ సింగ్, ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అసెంబ్లీలో విపక్ష నేత చరణ్ దాస్ మహంత తదితరులు పాల్గొన్నారు.
నవ రాయపుర్‌లో 51 ఎకరాల స్థలంలో రూ.324 కోట్లతో నూతన అసెంబ్లీ భవన నిర్మాణం జరిగింది. ఛత్తీస్‌గఢ్ సాంస్కృతిక గుర్తింపు, ప్రగతిశీల స్ఫూర్తికి నూతన విధానసభ కాంప్లెక్ ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
చంపుతామంటూ బీజేపీ ఎంపీకి ఫోనులో బెదిరింపులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి