Share News

PM Modi: మన ఆడకూతుళ్లు యుద్ధ విమానాలు నడుపుతున్నారు.. అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళన్‌లో మోదీ

ABN , Publish Date - Oct 31 , 2025 | 08:31 PM

న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్-2025ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌ పేరును ప్రత్యేకించి ప్రస్తావించారు.

PM Modi: మన ఆడకూతుళ్లు యుద్ధ విమానాలు నడుపుతున్నారు.. అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళన్‌లో మోదీ
PM Modi in International Arya Maha sammelan

న్యూఢిల్లీ: దేశంలో రక్షణ, అంతరిక్ష, వ్యవసాయ రంగాలతోపాటు అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం విస్తరిస్తుండటం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసించారు. శుక్రవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్-2025 (International Arya Mahasammelan-2025)ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌ (Shivangi Singh)పేరును ప్రత్యేకించి ప్రస్తావించారు. 'ఇవాళ మన ఆడకూతుళ్లు యుద్ధ విమానాలు నడుపుతున్నారు' అని హర్షం వ్యక్తం చేశారు. మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి, 150 ఏళ్లుగా ఆర్యసమాజ్‌ సేవలకు గుర్తింపుగా జరుగుతున్న జ్ఞాన జ్యోతి ఫెస్టివల్‌లో భాగంగా అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్-2025ను నిర్వహించారు.


droupadi-murmu-with-Shivang.jpg

'రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండ్రోజుల క్రితం భారత తొలి మహిళా రాఫెల్ పైలట్లలో ఒకరైన స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌తో కలిసి రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఇవాళ మన మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు. డ్రోన్ దీదీలుగా మారి అధునాతన వ్యవసాయాన్నీ ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా స్టెమ్ (STEM) గ్రాడ్యుయేట్లు భారతదేశంలోనే ఉండటం మనకు గర్వంగా చెప్పుకోవచ్చు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లోనూ న్యాయకత్వ పాత్రను మహిళలు పోషిస్తున్నారు' అని ప్రధాని అన్నారు.


రెండేళ్లుగా నిరంతర మేథోయజ్ఞం

దేశంలో గత రెండేళ్లుగా నిరంతర మేథో యజ్ఞం జరుగుతోందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతేడాది దయానంద్ సరస్వతి జన్మస్థలమైన గుజరాత్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించామని, దానికి ముందు మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి ఉత్సవాలను ఢిల్లీలోను తాను ప్రారంభించానని చెప్పుకొచ్చారు. అదే ఈవెంట్‌లో రెండేళ్ల పాటు ఈ మహా యజ్ఞాన్ని కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సమాజానికి ఆర్యసమాజ్, స్వామి దయానంద సరస్వతి చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. దేశ వైదిక గుర్తింపు, పునరుత్తేజ స్ఫూర్తిని ఈ వేడుకలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.


coin.jpg

స్మారక నాణేలు

ఈ సందర్భంగా మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి, ఆర్యసమాజ్ 150 ఏళ్ల సేవలకు సంబంధించిన స్మారక నాణేలను ప్రధాని విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలి.. ఖర్గే డిమాండ్

కేజ్రీవాల్‌ కోసం మరో శీష్ మహల్.. ఫోటో షేర్ చేసిన బీజేపీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 31 , 2025 | 09:20 PM