Share News

DCM Shivakumar: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. ఎంపీ తేజస్వీ సూర్య.. ఓ వేస్ట్‌ మెటీరియల్‌

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:54 PM

ఎంపీ తేజస్వీ సూర్య ఇంకా చిన్నపిల్లోడని, అనుభవం లేదని, అతను ఓ వేస్ల్‌ మెటీరియల్‌ అంటూ డీసీఎం డీకే శివకుమార్‌ మండిపడ్డారు. శుక్రవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో సొరంగ మార్గం నిర్మించరాదనేందుకు తేజస్వీ ఎవరని ప్రశ్నించారు.

DCM Shivakumar: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. ఎంపీ తేజస్వీ సూర్య.. ఓ వేస్ట్‌ మెటీరియల్‌

- కుటుంబంతో కలిసి బస్సులో తిరుగుతారా..?

- సొరంగమార్గం వద్దనేందుకు అతడెవరు: డీసీఎం డీకే

బెంగళూరు: ఎంపీ తేజస్వీ సూర్య(MP Tejaswi Surya) ఇంకా చిన్నపిల్లోడని, అనుభవం లేదని, అతను ఓ వేస్ల్‌ మెటీరియల్‌ అంటూ డీసీఎం డీకే శివకుమార్‌(DCM Shivakumar) మండిపడ్డారు. శుక్రవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో సొరంగ మార్గం నిర్మించరాదనేందుకు తేజస్వీ ఎవరని ప్రశ్నించారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే సొరంగ మార్గాలు వద్దనే రీతిలో మాట్లాడతారన్నారు. కేంద్రమంత్రి అయినప్పుడు లోక్‌సభలో తీర్మానం చేయాల్సింది అంటూ మండిపడ్డారు.


టన్నెల్‌రోడ్డు ప్రాజెక్టును నిపుణుల అభిప్రాయం ప్రకారం చేయాల్సి ఉండేది కదా అనే మీడియా ప్రశ్నకు సమాధానంగా ఏదో ఎంపీ కదా అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడే అవకాశం ఇస్తే ఏదేదో మాట్లాడతారన్నారు. తేజస్వీకు ప్రపంచ ఎలా ఉందనేది తెలియదంట అని మండిపడ్డారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు కారు లేదంటే పెళ్ళికి అమ్మాయిని ఇచ్చేవారు కాదని చెప్పానని అదే అంశాన్ని ప్రస్తావిస్తారన్నారు. తేజస్వీతో పాటు కుటుంబం బస్సు, మెట్రోలో ప్రయాణిస్తారా అంటూ ప్రశ్నించారు.


pandu3.2.jpg

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలలోనే బీజేపీ వారంతా తిరగమనండి.. ఎవరు వద్దని చెప్పరన్నారు. బెంగళూరు(Bengaluru)లో 1.30 కోట్ల మంది జనాభా ఉన్నారని ఏటా వలస వచ్చేవారు పెరుగుతూనే ఉన్నారన్నారు. రాష్ట్రానికి మెట్రో తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు. కాగా ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడుతూ 1800 కార్లు తిరిగేందుకు రూ.43వేల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమా అని ప్రశ్నించారు. వేలకోట్లతో 18 కిలోమీటర్ల సొరంగ మార్గం ప్రయోజనకరమైన ప్రాజెక్టు అవుతుందా అని ప్రశ్నించారు. మెట్రో, సబ్‌ అర్బన్‌ రైళ్ళ సంఖ్యను పెంచాల్సి ఉందని వివరించారు. ప్రజా సంక్షేమం కొరకే ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతిపక్షాలు విమర్శించడం తగదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మపాల అమృతాన్ని పంచి..

తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2025 | 12:54 PM