PM Modi: పవార్‌కు కుర్చీ చూపించి నీళ్లు అందించిన మోదీ
ABN , Publish Date - Feb 21 , 2025 | 08:38 PM
వేదికపై పవార్ తన సీటు దగ్గరకు వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తుండగా మోదీ ఆయనకు సహకరించి ఆయన కూర్చీలో కూర్చున్న తర్వాత తాను కూడా కూర్చున్నాను. వాటర్ బాటిల్ మూత తీసి అందులోని నీటిని పవార్‌కు ఎదురుగా ఉంచిన గ్లాసులో పోసారు.

న్యూఢిల్లీ: సైద్ధాంతిక విభేదాలు, పార్టీలు, హోదాలు వేరైనా కొందరు రాజకీయ నేతలు తమ సీనియర్ రాజకీయ నేతలతో ఒకే వేదికను పంచుకున్నప్పుడు వారి పట్ల ఆప్యాయతను చాటుకుంటారు. పెద్దల పట్ల గౌరవం ప్రదర్శించి తమ నమ్రతను చాటుతారు. మరాఠా సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ (Sharad Pawar) పట్ల స్యయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇలాంటి గౌరవాన్నే ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తర్వాత సభలో కరతాళ ధ్వనులు మార్మోగాయి. ఢిల్లీలో శుక్రవారంనాడు జరిగిన 98వ అఖిల్ భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్‌లో ఈ అపురూప ఘట్టం చోటుచేసుకుంది.
PM Modi SOUL Conclave: అన్నిరంగాల్లో విజనరీ నేతలు తయారు కావాలి.. సోల్ సదస్సులో మోదీ
వేదికపై పవార్ తన సీటు దగ్గరకు వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తుండగా మోదీ ఆయనకు సహకరించి ఆయన కూర్చీలో కూర్చున్న తర్వాత తాను కూడా కూర్చున్నాను. వాటర్ బాటిల్ మూత తీసి అందులోని నీటిని పవార్‌కు ఎదురుగా ఉంచిన గ్లాసులో పోసారు. తన కంటే సీనియర్ నేతల పట్ల ప్రధాని చూపిన నమ్రత సభికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొందరైతే హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ చప్పట్లు చరిచారు.
కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మోదీ ప్రారంభిస్తూ, ఈవెంట్ రెసెప్షన్ కమిటీ చైర్మన్ అయిన పవార్‌ను సైతం జ్యోతి ప్రజ్వలనలో పాలుపంచుకోవాలని కోరారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ. శరద్ పవార్ ఆహ్వానించడంతో ఇంతటి సాంప్రదాయక ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం తనకు వచ్చిందన్నారు. అనంతరం కార్యక్రమం నడుస్తున్నంత సేపూ మోదీ, పవార్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం కనిపించింది.
ఇవి కూడా చదవండి..
Ranveer Allahbadia Controversy: రాఖీ సావంత్‌కు మహారాష్ట్ర పోలీసులు సమన్లు
MEA: జమ్మూకశ్మీర్‌పై ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితం.. భారత్ తీవ్ర అభ్యంతరం
DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
Birthday: వారం ముందే సీఎం స్టాలిన్ జన్మదిన వేడుకలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.