Share News

Chennai News: తలైవరే... సౌఖ్యమా..

ABN , Publish Date - Aug 01 , 2025 | 01:48 PM

డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) గురువారం రెండుసార్లు కలుసుకుని రాజకీయ కలకలం సృష్టించారు. ఉదయం అడయార్‌ కళాక్షేత్ర ప్రాంతంలో స్టాలిన్‌ వాకింగ్‌కు వెళ్తుండగా ఓపీఎస్‌ తారసపడ్డారు. ఇద్దరూ ఐదు నిమిషాలపాటు ఆప్యాయంగా పలుకరించుకున్నారు.

Chennai News: తలైవరే... సౌఖ్యమా..

- వాకింగ్‌ సమయంలో సీఎంకు తారసపడిన ఓపీఎస్‌

- మళ్లీ సాయంత్రం స్టాలిన్‌ ఇంట్లో భేటీ

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)ను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) గురువారం రెండుసార్లు కలుసుకుని రాజకీయ కలకలం సృష్టించారు. ఉదయం అడయార్‌ కళాక్షేత్ర ప్రాంతంలో స్టాలిన్‌ వాకింగ్‌కు వెళ్తుండగా ఓపీఎస్‌ తారసపడ్డారు. ఇద్దరూ ఐదు నిమిషాలపాటు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. స్టాలిన్‌ ఆరోగ్యం ఎలా ఉందని ఓపీఎస్‌ అడిగారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని స్టాలిన్‌ తెలిపారు.


ఆ తర్వాత గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓపీఎస్‌ ఆళ్వార్‌పేటలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఓపీఎస్‌ కలుసుకున్నారు. ఎన్డీయే నుండి వైదొలగినట్లు ప్రకటించిన కొద్ది సేపటికే ఆయన స్టాలిన్‌ నివాసగృహానికి వెళ్ళటంతో డీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికే వెళ్ళారంటూ ప్రచారం జరిగింది. సుమారు అరగంటసేపు స్టాలిన్‌తో ఆయన సమావేశం కావటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


ఈ సమావేశం అనంతరం ఓపీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకే మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని చెప్పారు. అదే సమయంలో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేరన్నారు. జయలలిత హయాంలో 25 యేళ్లపాటు అన్నాడీఎంకేకు సేవలందించానని తెలిపారు.


nani6.2.jpg

విజయ్‌ నాయకత్వంలోని టీవీకేతో పొత్తుపెట్టుకుంటారా? అని విలేఖరులు ప్రశ్నించినప్పుడు ఎన్నికల సమయంలో ఏవైనా జరుగవచ్చన్నారు. స్టాలిన్‌ను పరామర్శించేందుకే కలుసుకున్నానని, ఎన్నికల పొత్తులు గురించి ఆయన అడగలేదని, తానూ ప్రస్తావించలేదని, ఇరువురి భేటీ మర్యాదపూర్వకంగానే సాగిందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2025 | 01:49 PM