Share News

BJP: తేల్చి చెప్పేశారుగా.. అధికారంలో భాగస్వామ్యం కోరం..

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:49 AM

అధికారంలో భాగస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ పలు సర్వేలు ఇప్పటికే సూచన ప్రాయంగా వెల్లడించాయన్నారు.

BJP: తేల్చి చెప్పేశారుగా.. అధికారంలో భాగస్వామ్యం కోరం..

- సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగలేదు

- బీజేపీ చీఫ్‌ నయినార్‌ నాగేంద్రన్‌

చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వంలో భాగస్వామ్యం అడగమని, కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆయన తొలిసారిగా ఓ ఆంగ్లపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నాడీఎంకే - బీజేపీ(AIADMK-BJP) మధ్య అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపలేదన్నారు. అలాగే అన్నాడీఎంకే ప్రభుత్వంలో భాగస్వామ్యం కోరబోమని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ వార్తను కూడా చదవండి: తల్లి కోరిక మేరకు 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న బీజేపీ నేత


అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల మధ్య పొత్తు హడావుడిగా ఏర్పాటైంది కాదన్నారు. 2019, 2021 ఎన్నికల్లో కూడా తాము కలిసే పోటీ చేశామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇకపై కలిసి ముందుకు సాగాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇపుడు రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న డీఎంకే కూటమిని ఓడించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఇంకా ఒక యేడాది సమయం ఉందని, అందువల్ల సీట్ల సర్దుబాటుపై ఇపుడే చర్చించాల్సిన అవసరం లేదన్నారు.


nani1.2.jpg

అదేసమయంలో వచ్చే ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ పలు సర్వేలు ఇప్పటికే సూచన ప్రాయంగా వెల్లడించాయన్నారు. ఈ సర్వేల అంచనా ప్రకారం అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం కోరబోమన్నారు. నీట్‌ను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, వాస్తవానికి కాంగ్రెస్‌ - డీఎంకే కూటమిలోనే నీట్‌ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇపుడు నీట్‌ను రాజకీయం చేస్తున్నారని నయినార్‌ నాగేంద్రన్‌ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం

ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి

మాటల్లో కాదు చేతల్లో చూపండి

కీర్తి సురేష్ క్యూట్‏గా...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 19 , 2025 | 11:49 AM