EOL Vehicles: ఈ వాహనాలకు పెట్రోల్ బంద్.. రోడ్ల మీదకొస్తే..!
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:09 AM
ఈ వాహనాలకు ఇవాళ్టి నుంచి పెట్రోల్ బంద్ చేసేసింది సర్కారు. రోడ్డు మీదకు వస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

కాలం చెల్లిన వాహనాలు, పాత బండ్ల యజమానులకు గట్టి షాక్ ఇచ్చింది ఢిల్లీ సర్కారు. ఇక నుంచి ఓల్డ్ వెహికిల్స్‌కు డీజిల్, పెట్రోల్ పోయొద్దనే నయా రూల్‌ను తీసుకొచ్చింది రేఖా గుప్తా ప్రభుత్వం. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా బీజేపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక వాహనాలకే గాక దేశంలో ఎక్కడి నుంచి వచ్చే వాహనాలకైనా సరే.. పాతవని తేలితే ఇప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ పోయొద్దని ఢిల్లీ సర్కారు డిసైడ్ అయింది.
అన్నీ సరిగ్గా ఉంటేనే..
10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వెహికిల్స్‌కు ఇక మీదట ఇంధనం పోసేది లేదని ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ తేల్చి చెప్పింది. జులై 1వ తేదీ నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కాగా, దేశ రాజధానిలో లైఫ్ టైమ్ అయిపోయిన వాహనాలను గుర్తించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా 500 స్టేషన్స్‌లో ఏఎన్‌పీఆర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కొత్త నిబంధనల్లో భాగంగా తొలుత వాహనాల నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేయడంతో పాటు వాహన రికార్డులను చెక్ చేస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే అప్పుడు వాహనాల్లో ఇంధనం నింపుతారు. ఇకపోతే, ఢిల్లీలో 62 లక్షల పాత వాహనాలు ఉన్నట్లు సమాచారం. రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇలాంటి వాహనాలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే నో ఫ్యూయల్ రూల్‌ను సర్కారు తీసుకొచ్చింది.
ఇవీ చదవండి:
ఇరాన్ అణు కార్యక్రమం మళ్లీ మొదలు
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అకృత్యం
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి