KIIT: యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని ఆత్మహత్యపై ప్రధాని ఆగ్రహం..
ABN , Publish Date - Feb 17 , 2025 | 09:13 PM
ఓ యూనివర్సిటీలో చదువుతున్న నేపాలీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఓలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ చూద్దాం.

ఒడిశా(Odisha) భువనేశ్వర్‌లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న నేపాలీ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రకృతి లామ్సాల్ ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై నేపాల్ ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి (Nepal PM Oli) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరగాలని ప్రధాని కోరారు. ఈ విషాద ఘటనపై స్పందిస్తూ ఒడిశాలోని బాధిత నేపాలీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి న్యూఢిల్లీలోని వారి రాయబార కార్యాలయం ఇద్దరు అధికారులను పంపించింది. దీంతోపాటు విద్యార్థులు తమ హాస్టల్‌లో ఉండటానికి లేదా ఇంటికి తిరిగి రావడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
న్యాయం చేయాలని...
భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT)లో మూడో సంవత్సరం బీటెక్ విద్యార్థిని ప్రకృతి లామ్సాల్ ఆదివారం సాయంత్రం తన హాస్టల్ గదిలో చనిపోయి కనిపించడంతో క్యాంపస్‌లో నిరసనలు చెలరేగాయి. ఈ ఘటనపై నిరసన తెలిపిన విద్యార్థులు, వర్సిటీ అధికారుల తీరును తప్పుబట్టారు. నేపాలీ విద్యార్థులను క్యాంపస్‌ను ఖాళీ చేయమని అధికారులు చెప్పారని ఆరోపించారు. ఈ క్రమంలో న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
కారణమిదేనా..
ఆ క్రమంలో వందలాది మంది విద్యార్థులు క్యాంపస్‌లో గుమిగూడి, న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు KIIT ఓ ప్రకటనలో విద్యార్థిని మరణం వ్యక్తిగతానికి సంబంధించినదిగా అనుమానిస్తున్నట్లు తెలిపింది. ఆ విద్యార్థిని KIITలో చదువుతున్న మరో విద్యార్థితో ప్రేమలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఏదో కారణం చేత ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనపై నేపాలీ విద్యార్థులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
విద్యార్థుల భద్రతపై..
నేపాలీ విద్యార్థుల దృష్టిలో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, తక్షణమే కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని పలు సందర్భాల్లో విన్నవించారు. ఈ ఉదంతం విదేశీ విద్యార్థుల ఆందోళనలకు దారితీసింది. దర్యాప్తులో నిపుణుల సమీక్ష అవసరం అని భావిస్తున్నారు. ఈ ఘటన నేపాలీ విద్యార్థుల మధ్య తీవ్ర ఆందోళనను కలిగించింది. వారు తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రకృతి లామ్సాల్ మరణం విద్యార్థుల భద్రతపై చర్చలను ప్రస్తావిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Viral News: పార్లమెంటులో అబద్ధం చెప్పిన ఎంపీ.. ఫైన్ విధించిన కోర్టు, పదవి కూడా..
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News