Share News

Maharashtra: పెళ్లికి ముందే టార్చర్.. కాబోయే భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్..

ABN , Publish Date - Apr 20 , 2025 | 10:57 AM

Nashik Man Suicide Fiancée Harassment: పెళ్లి తర్వాత వరకట్న వేధింపుల పేరుతో భర్తను, వారి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పే భార్యల కేసులు ఈ మధ్య పెరిగిపోవడం వినే ఉంటారు. కానీ, ఓ యువతి పెళ్లి కాకముందే తన బండారం బయటపడటంతో కాబోయే భర్త, అతడి కుటుంబంపై వరకట్నం కేసు పెడతానని నిరంతరం వేధించడంతో.. మానసిక క్షోభకు గురై ఓ వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.

Maharashtra: పెళ్లికి ముందే టార్చర్.. కాబోయే భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్..
Maharashtra Man Suicide Fiancée Harassment

Nashik Man Suicide Fiancée Harassment: కాబోయే భార్య వేధింపులు భరించలేక మహారాష్ట్ర నాసిక్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల ఆదాయపు పన్ను అధికారి హరేరామ్ సత్యప్రకాష్ పాండే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే ఆయనకు వారణాసికి చెందిన మోహిని పాండేతో నిశ్చితార్థం జరిగింది. ఫియాన్సీ ప్రేమ వ్యవహారం ఎంగేజ్‌మెంట్ నాడే గమనించిన హరేరామ్.. అతడ్ని వదిలేస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడమే పాపమైంది.పెళ్లికి నిరాకరిస్తే తప్పుడు కట్నం కేసు పెడతామని కాబోయే వధువును బెదిరించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


35 ఏళ్ల నిరీక్షణ ఫలించి ఎట్టకేలకు ఓ మంచి అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతోందని.. తనకో అద్భుత భాగస్వామి దొరికిందని మురిసిపోయినంతలోనే హరేరామ్ సత్యప్రకాష్ పాండేకు ఆ రోజునే ఊహించని షాక్ తగిలింది. ఎంగేజ్‌మెంట్ రోజే తన ప్రియుడు సురేష్ పాండేను అందరి ముందు కాబోయే భార్య కౌగిలించుకోవడం చూసి నోట మాట రాలేదు. విషయం బట్టబయలు అయినా.. అతడితో సంబంధం తెంచుకుంటే పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం లేదని.. ఏదొకటి తేల్చుకోమని మోహినితో చెప్పాడు. కానీ, ఆమె అందుకు నిరాకరించడమే కాకుండా బెదిరింపులకు దిగింది. రోజురోజుకీ టార్చర్ పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఉరితాడే శరణ్యమనుకున్నాడు ఆ అభాగ్యుడు.


హరేరామ్ ఇంటి బయట 3-4 రోజుల పాల సంచులను పొరుగువారు గమనించి ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఇంట్లోకి ప్రవేశించి చూడగా శవమై కనిపించాడు హరేరామ్. దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హరేరామ్ సోదరుడు హరేకృష్ణ పాండే పోలీసులకు ఫిర్యాదు ఆధారంగా ఆత్మహత్యకు ప్రేరేపించిన మోహిని, సురేష్, మయాంక్ మునేంద్ర పాండే అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. హరేరామ్‌పై జరిగిన నిరంతర వేధింపులే మానసిక స్థితిని దెబ్బతీసి అతడి మరణానికి దారితీశాయని హరేకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.


Read Also: Anurag Kashyap: బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన స్టార్ డైరక్టర్..

Mallikarjun Kharge: మేము భయపడం.. ఈడీ చార్జిషీటులో సోనియా, రాహుల్ పేర్లపై ఖర్గే

Bengaluru Language Controversy: మర్యాదగా హిందీలో మాట్లాడకపోయావో.. బెంగళూరులో ఉండలేవు.. ఆటో డ్రైవర్‌పై ఓ వ్యక్తి..

Updated Date - Apr 20 , 2025 | 03:14 PM