Shashi Tharoor: నా మాటలు బీజేపీలో చేరడానికి సంకేతం కాదు
ABN , Publish Date - Jun 24 , 2025 | 02:50 PM
ఇతర దేశాలతో సంబంధాలను బలపరుచుకోవడంలో మోదీ శక్తి, చైతన్యం ప్రదర్శించారని తాను చెప్పానని, ఇది ఎంత మాత్రం బీజేపీ విదేశాంగ విధానమో, కాంగ్రెస్ విదేశాంగ విధానం గురించో కాదని శశిథరూర్ అన్నారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర దేశాలతో సంబంధాలను బలపరచుకోవడంలో శక్తి, చైతన్యం ప్రదర్శించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసం కాంగ్రెస్‌ను మరోసారి ఇరుకున పెట్టింది. శశిథరూర్ బీజేపీలో చేరనున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై శశిథరూర్ తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రధానమంత్రి పార్టీ (BJP)లో చేరడానికి ఎలాంటి సంకేతము కాదని వివరణ ఇచ్చారు.
ఆపరేషన్ సింధూర్ విజయాన్ని వివరిస్తూ అన్ని పార్టీల ఐక్యతను ఆ వ్యాసంలో తాను ప్రస్తావించానని చెప్పారు. ఇతర దేశాలతో సంబంధాలను బలపరుచుకోవడంలో మోదీ శక్తి, చైతన్యం ప్రదర్శించారని తాను చెప్పానని, ఇది ఎంత మాత్రం బీజేపీ విదేశాంగ విధానమో, కాంగ్రెస్ విదేశాంగ విధానం గురించో కాదని, భారతదేశ విదేశాంగ విధానం గురించి మాత్రమేనని శశిథరూర్ తెలిపారు. పదకొండేళ్ల క్రితం పార్లమెంటు విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఈ విషయం తాను చెప్పానని గుర్తు చేశారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్‌కు వ్యతిరేకంగా మొదలైన దౌత్యయుద్ధంలో భాగంగా ఏర్పాటుచేసిన ఏడు ఎంపీల బృందాల్లో ఒకదానికి శశిథరూర్ నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన దౌత్య కృషి మన జాతీయ సంకల్పం, ప్రతిభావంతమైన వ్యక్తీకరణకు నిదర్శనంగా నిలిచిందని శశిథరూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. భారతదేశ ధృడ వైఖరిని ప్రపంచానికి చాటిచెప్పిందని తెలిపారు. ప్రధాని శక్తి, డైనమిజాన్ని ప్రశంసించారు. శశిథరూర్ వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
ఇవి కూడా చదవండి..
ప్రధాని కలుపుగోలుతనం గొప్ప ఆస్తి
హీరో విజయ్‌కి అన్నాడీఎంకే గాలం.. డిప్యూటీ సీఎం పదవి ఆఫర్..
For National News And Telugu News