Nishant Kumar: మళ్లీ మా నాన్నే సీఎం
ABN , Publish Date - Jul 20 , 2025 | 05:10 PM
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా సేవలందించిన 75 ఏళ్ల నితీష్ కుమార్ మరోసారి అధికారాన్ని ఆశిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ భాగస్వామిగా ఉన్నాయి.

పాట్నా: త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, తన తండ్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆయన కుమారుడు నిషాంత్ కుమార్ (Nishant Kumar) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి, ప్రజలకు నితీష్ ఎంతో చేశారని, ప్రజలు ఎన్డీయేను గెలిపించి మరోసారి ప్రజాసేవ చేసే అవకాశం ఆయన కల్పిస్తారని పాట్నాలో ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ నిషాంత్ చెప్పారు.
'మళ్లీ మా నాన్నగారే సీఎం అవుతారు. ప్రభుత్వాన్ని ఎన్డీయే ఏర్పాటు చేస్తుంది. మేము గట్టి మెజారిటీతో గెలుస్తాం. గత 20 ఏళ్లుగా ఆయన చేసిన సేవలు, పనులకు గుర్తింపుగా మరోసారి నితీష్ కుమార్‌ను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారనే నమ్మకం నాకుంది' అని నిశాంత్ తెలిపారు.
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా సేవలందించిన 75 ఏళ్ల నితీష్ కుమార్ మరోసారి అధికారాన్ని ఆశిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ భాగస్వామిగా ఉన్నాయి. ఈసారి నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది. తేజస్వి యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ, వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయి.
నితీష్ పాపురాలిటీ తగ్గుతోందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు ఆయన సారథ్యం వహించక పోవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే బీహార్‌లో ఎన్డీయేకు నితీష్ సారథ్యం వహిస్తారని బీజేపీ స్పష్టత ఇచ్చింది. నితీష్ కుమార్ 2013లో ఎన్డీయేను విడిచిపెట్టి తన చిరకాల ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్‌తో చేతులు కలిపారు. 2017లో ఆర్జేడీని వీడి తిరిగి ఎన్డీయేలోకి వచ్చారు. 2022లో తిరిగి ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో కలిసారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మరోసారి ఆయన పీఎం మోదీ క్యాంపులోకి వచ్చిచేరారు.
ఇవి కూడా చదవండి..
ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ప్రస్తావనెందుకు? కస్సుమన్న సిద్ధరామయ్య
దేశం విషయంలో రాజకీయ వైరాలు అడ్డుకారాదు: శశిథరూర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి