Tahwwur Rana: ఎన్‌ఐఏ దర్యాప్తునకు ముంబై పోలీసుల సహకారం: ఫడ్నవిస్
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:53 PM
రాణాను విజయవంతంగా ఇండియాకు తీసుకువచ్చి దేశ న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఫడ్నవిస్ ప్రశంసించారు. నవంబర్ 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో తమ కుటుంబాలను కోల్పోయిన ముంబై ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

ముంబై: 26/11 ముంబై ఉగ్రదాడి కుట్రలో ఒకడైన తహవుర్ రాణా (Tahwwur Rana)ను అమెరికా నుంచి భారత్ తీసుకురావడం, ఎన్ఐఏ నేతృత్వంలో దర్యాప్తు జరుపుతుండటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) శుక్రవారంనాడు స్పందించారు. దర్యాప్తు విషయంలో ఎన్ఐఏకు ముంబై పోలీసులు సహకరిస్తారని రాష్ట్ర హోం మంత్రిగా కూడా ఉన్న ఫడ్నవిస్ చెప్పారు.
Himanta Biswa Sarma: ముంబై ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నా: అసోం సీఎం
రాణాను ఢిల్లీ నుంచి ముంబై తీసుకువస్తారా అని అడిగినప్పుడు, దానిపై ఎన్ఐఏ నిర్ణయిం తీసుకుంటుందని సీఎం జవాబిచ్చారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఎన్ఐఏ కలిసి రాణాను ఎక్కడికి తీసుకువెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎన్ఏఐకు అన్ని విధాలా సహకరించేందుకు ముంబై పోలీసులు సిద్ధంగా ఉన్నారని, అలాగే దర్యాప్తు అప్డేట్‌లు అవసరమనుకుంటే ముంబై పోలీసులు ఎన్ఐఏను సంప్రదిస్తారని చెప్పారు.
ముంబై ప్రజల తరఫున..
రాణాను విజయవంతంగా ఇండియాకు తీసుకువచ్చి దేశ న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఫడ్నవిస్ ప్రశంసించారు. నవంబర్ 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో తమ కుటుంబాలను కోల్పోయిన ముంబై ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ముంబై ఉగ్రదాడుల తర్వాత ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తొలుత విచారణ చేపట్టారు. తొలి ఛార్జిషీటును కూడా దాఖలు చేశారు. ఆ తర్వాత క్రమంలో ఎన్ఐఏ రంగలోకి అడుగుపెట్టి దర్యాప్తును తమ అధీనంలోకి తీసుకుంది.
ఇవి కూడా చదవండి..