MUDA Scam: ముడా స్కామ్‌లో కీలక పరిణామం
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:21 PM
రెసిడెన్సియల్ లేఔట్స్ కింద మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ సీఎం సతీమణి నుంచి భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా మైసూరులో విలువైన భూములు కేటాయించింది. ఆమె నుంచి సేకరించిన భూముల విలువ కంటే అత్యధిక విలువ కలిగిన భూములను ఆమెకు కేటాయించారనేది ప్రధాన వివాదం.

బెంగళూరు: మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపు కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతిని తమ ముందు హాజరుకావాల్సిందిగా ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారంనాడు సమన్లు పంపింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, రికార్డులు తమకు సమర్పించాలని ఈడీ అడిషనల్ డైరెక్టరేట్ మురళీకృష్ణన్ లేఖ రాశారు.
Waqf Bill: వక్ఫ్ సవరణల బిల్లుకు జేపీసీ ఆమోదం
దీనిపై మురళీకృష్ణన్ మాట్లాడుతూ, 2002 మనీలాండరింగ్ చట్టంలోని నిబంధనల కింద ఈ కేసుపై తాను విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. పీఎంఎల్ఏ కింద విచారణలో భాగంగా సాక్ష్యాలు, రికార్డులు సమర్పించడానికి సీఎం సతీమణి నేరుగా తమ ముందు హాజరుకావాల్సిన అవసరం ఉందన్నారు.
ముడా భూముల కేసు
రెసిడెన్సియల్ లేఔట్స్ కింద మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ సీఎం సతీమణి నుంచి భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా మైసూరులో విలువైన భూములు కేటాయించింది. ఆమె నుంచి సేకరించిన భూముల విలువ కంటే అత్యధిక విలువ కలిగిన భూములను ఆమెకు కేటాయించారనేది ప్రధాన వివాదం. ఆమె నుంచి 3.16 ఎకరాల భూమిని తీసుకుని 50:50 రేషియో కింద ప్లాట్లను ముడా కేటాయించింది. మైసూరు తాలూకు కేసవ హొబ్లిలోని కసరె గ్రామంలో సర్వే నెంబర్ 464లోని 3.16 ఎకకాల భూమికి సంబంధించి సీఎం భార్యకు లీగల్ టైటిల్ లేదనేది ప్రధాన ఆరోపణ. దీనిపై లోకాయుక్త, ఈడీ ఏకకాలంలో విచారణ జరుపుతున్నాయి.
Sanatan Vedic Nation : సనాతన వైదిక దేశమే లక్ష్యం
India IST Now : ఇక నుంచి భారత్‌లో.. వన్ టైమ్.. వన్ నేషన్..
Saif Ali Attack Case: ఉద్యోగం, పెళ్లి రెండూ పోయాయి.. దాడి అనుమానితుడి ఆవేదన
Read More National News and Latest Telugu News