MLA Sri Ganesh: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. నన్ను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారు..
ABN , Publish Date - Jul 22 , 2025 | 10:14 AM
తనను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. సోమవారం అడ్డగుట్టలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి మాణికేశ్వర్‌నగర్ బస్తీలో ఫలహారబండి ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్తున్న తనపై 10 ద్విచక్రవాహనాలపై వచ్చిన 30 మంది దాడికి యత్నించారని తెలిపారు.

- ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్: తనను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారని ఎమ్మెల్యే శ్రీగణేష్(MLA Sri Ganesh) అన్నారు. సోమవారం అడ్డగుట్టలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి మాణికేశ్వర్‌నగర్ బస్తీలో ఫలహారబండి ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్తున్న తనపై 10 ద్విచక్రవాహనాలపై వచ్చిన 30 మంది దాడికి యత్నించారని తెలిపారు. సినీ ఫక్కీలో తమ వాహనాలను వెంబడించారని తెలిపారు.
లైట్లు, సీసీ కెమెరాలు(CCTV cameras) లేని చోట తమ వాహనాలు, గన్‌మన్‌పై దాడి చేశారని వివరించారు. హత్యలు, నేరాలు చేసే వ్యక్తులకు భయపడేవాడిని కాదని, నేర చరిత్రగల వ్యక్తితో తనకు ముప్పు ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్(North Zone DCP Rashmi Perumal)కు విజ్ఞప్తి చేశారు. దాడి ఘటనపై పోలీసులకు మంగళవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని డీసీపీకి చెప్పానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..
Read Latest Telangana News and National News