Share News

Minister Viral Video: హోటల్ గదిలో నోట్ల కట్టలతో మంత్రి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Jul 11 , 2025 | 05:19 PM

ఓ మంత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. హోటల్ గదిలో నోట్ల కట్టల బ్యాగుతో ఉన్న మంత్రిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈయన ఎవరో కాదు..

Minister Viral Video: హోటల్ గదిలో నోట్ల కట్టలతో మంత్రి.. వీడియో వైరల్..

ఓ మంత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. హోటల్ గదిలో నోట్ల కట్టల బ్యాగుతో ఉన్న మంత్రిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈయన ఎవరో కాదు.. మహారాష్ట్రకు చెందిన మంత్రి సంజయ్ షిర్సాత్‌. అవినీతి ఆరోపణలపై ఆదాయ పన్ను శాఖ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న ఈయన.. ఆ మరుసటి రోజు ఇలా నోట్ల కట్టలతో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.


మహారాష్ట్ర (Maharashtra) చెందిన మంత్రి సంజయ్ షిర్సాత్‌కు (Minister Sanjay Shirsat) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను శివసేన (UBT) వర్గానికి చెందిన సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో మంత్రి సంజయ్ హోటల్ గదిలో బెడ్‌పై కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉండగా.. ఆ పక్కనే కింద బ్యాగ్‌లో నోట్ల కట్టలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంజయ్ రౌత్.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై తనకు జాలిగా ఉందన్నారు. ఈ ఘటన ఆయన నిస్సహాయతకు నిదర్శనంగా ఉందని పేర్కొన్నారు.


2019, 2024 అసెంబ్లీ ఎన్నికల మధ్య మంత్రి సంజయ్ షిర్సాత్‌ అక్రమంగా అనేక కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడనే అంశంపై అధికారుల నుంచి నోటీసులు అందుకున్నారు. అయితే ఆ మరుసటి రోజే ఇలా హోటల్లో నోట్ల కట్టలతో బయటపడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై మంత్రి సంజయ్ షిర్సాత్‌ స్పందిస్తూ ఆ బ్యాగులో ఉన్నది నగదు కాదని, బట్టలు ఉన్నాయని చెప్పారు. అలాగే తనపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులపైనా వివరణ ఇచ్చారు. తనకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని, తనపై కొంతమంది ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగానే తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరినట్లు తెలిపారు. తాను ఎలాంటి అవినీతికీ పాల్పడలేదని, త్వరలో దీనిపై సరైన సమాధానం ఇస్తానంటూ మంత్రి షిర్సాత్‌ పేర్కొన్నారు. ఈయన ప్రస్తుతం ఔరంగాబాద్ (పశ్చిమ) ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

భారత వైద్య రంగంలో అద్భుతం.. అదానీ గ్రూప్ హెల్త్‌కేర్ టెంపుల్స్‌

టెన్నిస్ ప్లేయర్ హత్య.. ఈ మ్యూజిక్ వీడియోనే కారణం..

For More International News And Telugu News

Updated Date - Jul 11 , 2025 | 06:36 PM