MLA: నన్ను సస్పెండ్ చేసే సత్తా నాయకులకు లేదు..
ABN , Publish Date - Jan 23 , 2025 | 01:35 PM
జేడీఎస్(JDS) పార్టీలో తనను సస్పెండ్ చేసే సత్తా ఉన్న నాయకులు లేరని ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ(MLA GT Deve Gowda) అన్నారు. బుధవారం మైసూరు(Mysoor)లో రామ్‌లల్లా విగ్రహానికి ఉపయోగించిన రాయిని వెలికితీసిన ప్రదేశంలో పూజ చేశారు.

- జీటీ దేవెగౌడ
బెంగళూరు: జేడీఎస్(JDS) పార్టీలో తనను సస్పెండ్ చేసే సత్తా ఉన్న నాయకులు లేరని ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ(MLA GT Deve Gowda) అన్నారు. బుధవారం మైసూరు(Mysoor)లో రామ్‌లల్లా విగ్రహానికి ఉపయోగించిన రాయిని వెలికితీసిన ప్రదేశంలో పూజ చేశారు. అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహం ఏర్పాటైన సందర్భంగా పూజలు జరిపారు. ఇదే సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్‌లో తనను, బీజేపీ(BJP)లో యత్నాళ్‌పై చర్యలు తీసుకోవాలంటే సత్తా ఉండాలన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Sriramulu: శ్రీరాములు సంచలన ఆరోపణ.. నన్ను రాజకీయంగా అణగదొక్కేందుకే ‘గాలి’ కుట్ర
ఏం చేస్తారో వేచి చూస్తామన్నారు. పార్టీని పటిష్టం చేసే నాయకుడికి వేటు వేసే అధికారం ఉంటుందని, అటువంటి వారు ఎవరున్నారని ప్రశ్నించారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ముడా వివాదంలో రాజీనామా చేయాల్సిన పనిలేదన్నారు. రాజకీయంగా ఎవరెవరిపై ఎన్నికేసులు ఉన్నాయనేది అందరికీ తెలుసునన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి
ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు
ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?
Read Latest Telangana News and National News