Mallikarjun Kharge: సోనియా వ్యాఖ్యలను ట్విస్ట్ చేశారు.. బీజేపీపై ఖర్గే కౌంటర్ ఫైర్
ABN , Publish Date - Jan 31 , 2025 | 09:38 PM
రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని ఖర్గే పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగో లేదని చెప్పేందుకు ఆమె వాడిన "పూర్ థింక్'' అనే పదాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేగడంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వెంటనే స్పందించారు. సోనియాగాంధీ వ్యాఖ్యలను బీజేపీ, మీడియా వక్రీకరించిందంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగో లేదని చెప్పేందుకు ఆమె వాడిన "పూర్ థింక్'' అనే పదాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
PM Modi: రాష్ట్రపతిని అమమానించిన రాజకుటుంబం.. మోదీ ఫైర్
రాష్ట్రపతిని అవమానించింది బీజేపీనే
మోదీ ప్రభుత్వం ఖర్గే ఎదురుదాడి చేస్తూ, కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి కానీ, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కానీ రాష్ట్రపతిని ఆహ్వానించకుండా బీజేపీనే ఆమెను అమానపరిచిందని అన్నారు. పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా మొదటి రోజునే రాష్ట్రపతిని ఆహ్వానించనది బీజేపీ కాదా అని ఆయన నిలదీశారు. దేశ ప్రజలను కానీ, రాష్ట్రపతిని కానీ భారత జాతీయ కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ఎన్నడూ అవమానించలేదన్నారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ప్రజాస్వామ్య దేవాలయం (పార్లమెంటు), రామాలయం ప్రారంభోత్సవాలకు ప్రస్తుత రాష్ట్రపతిని కానీ, మాజీ రాష్ట్రపతిని కానీ ఆహ్వానించలేదని విమర్శించారు.
అసలు ఏం జరిగింది?
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ ద్రౌపది ముర్ము శుక్రవారం చేసిన ప్రసంగంపై సోనియాగాంధీ పార్లమెంటు వెలుపల స్పందించారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వివాదం రేపాయి. ''ప్రసంగం చివర్లో రాష్ట్రపతి బాగా అలసిపోయారు. మాట్లాడలేకయారు. పూర్ థింగ్'' అని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. రాష్ట్రపతిని అవమానించిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం గిరిజన ఆడబిడ్డను రాజకుంటానికి చెందిన కొందరు దురహంకారంతో అవమానించారని, ఇది దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్
Parliament: శీతాకాల సభల్లో సెగలే!
Read Latest National News And Telugu News