CM Siddaramaiah: ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి మద్దతు..
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:46 AM
ఉగ్రవాద దాడి అమానవీయ చర్య అని,ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడానికి, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.

బెంగళూరు: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir), అనంతనాగ్ జిల్లాలోని పహెల్‌గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack)ని ఖండిస్తున్నామని కర్నాక (Karnataka) ముఖమంత్రి సిద్దరామయ్య (CM Siddaramaiah) అన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రానికి రాష్ట్రం పూర్తిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడిలో మరణించిన కన్నడిగుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఆపదలో ఉన్న కన్నడిగులను రక్షించడం ప్రభుత్వ కర్తవ్యమని సిద్ధరామయ్య అన్నారు. బాగా చదువుకున్న యువకుడు భరత్ భూషణ్ ఉగ్రవాద దాడికి బలి కావడం దురదృష్టకరమని అన్నారు.
ఉగ్రవాద దాడి అమానవీయ చర్య..
ఉగ్రవాద దాడి అమానవీయ చర్య అని, ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడానికి, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అమాయక ప్రజలను పట్టపగలు, వారి కుటుంబాల ముందే చంపడం చాలా హేయమైన చర్యగా అభివర్ణించారు. కాశ్మీర్‌లో పుల్వామా, బాలాకోట్ సంఘటనలు ఇంతకు ముందు జరిగాయని.. అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమయ్యాయన్నారు.
Also Read..: మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..
కేంద్ర నిఘా విభాగం వైఫల్యం
కేంద్ర నిఘా విభాగం వైఫల్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని సీఎం సిద్ధ రామయ్య అన్నారు. కాశ్మీర్‌లో చిక్కుకున్న కన్నడిగులను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నామని, కర్మీర్‌కు వెళ్లిన 175 మంది కన్నడిగులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తున్నామన్నారు. ఉగ్రవాదులను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని సిద్ధ రామయ్య స్పష్టం చేశారు.
ఇద్దరు కర్ణాటక వాసులు మృతి
కాగా పహెల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు కర్ణాటక వాసులు మృతి చెందారు. హవేరికి చెందిన భారత్ భూషణ్, శివమొగ్గకు చెందిన మంజునాథ మృతి చెందారు. వారి మృత దేహాలు గురువారం తెల్లవారుజాము 3:30 గంటలకు బెంగళూరు విమానాశ్రయంకు చేరుకున్నాయి. మంజునాథ మృత దేహాన్ని శివమొగ్గకు తరలించారు. భారత్ భూషణ్ మృత దేహాన్ని బెంగళూరులోని సుందర నగర్‌కు తరలించారు. కాగా భూషణ్ టెక్కీగా పనిచేస్తూ బెంగళూరులో సెటిల్ అయిన హవేరికి చెందిన వ్యక్తి. ఆయన కుటుంబ సభుల కోరిక మేరకు సుందరనగర్‌కు మృతదేహాన్ని తరలించారు. కాగా భరత్ భూషణ్ మృతదేహానికి సీఎం సిద్దరామయ్య నివాలులర్పించారు. అలాగే రాజకీయ ప్రముఖులు భూషణ్ పార్థవదేహానికి నివాలులర్పిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి..
తుపాకీ లాక్కోబోయి.. తూటాలకు బలైపోయి..
For More AP News and Telugu News