Share News

Kamal Haasan: రాజ్యసభకు నామినేషన్ వేసిన కమల్‌హాసన్

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:32 PM

డీఎంకే ఒక రాజ్యసభ సీటును ఎంఎన్ఎన్‌కు కేటాయిస్తూ కమల్‌హాసన్‌ పేరును ఇటీవల ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 మంది సభ్యులుండగా, రాజ్యసభ అభ్యర్థుల గెలుపునకు ఒక్కొక్కరికి 34 ఓట్లు అవసరమవుతాయి.

Kamal Haasan: రాజ్యసభకు నామినేషన్ వేసిన కమల్‌హాసన్

చెన్నై: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్‌ హాసన్ (Kamal Haasan) రాజ్యసభకు శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. తమిళనాడు సెక్రటేరియట్‌లో ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. భాగస్వామ్య పార్టీల నేతలు వీసీకే చీఫ్ తిరుమావలన్, ఎండీఎంకే చీఫ్ వైకో, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగై సైతం పాల్గొన్నారు.


డీఎంకే ఒక రాజ్యసభ సీటును ఎంఎన్ఎంకు కేటాయిస్తూ కమల్‌హాసన్‌ పేరును ఇటీవల ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 మంది సభ్యులుండగా, రాజ్యసభ అభ్యర్థుల గెలుపునకు ఒక్కొక్కరికి 34 ఓట్లు అవసరమవుతాయి. 158 ఎమ్మెల్యేల బలం డీఎంకేకు ఉంది. డీఎంకేకు సొంతంగా 133 ఎమ్మెల్యేల బలం ఉండగా, భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్‌కు 17, వీసీకేకు 4, సీపీఐ, సీపీఎంలకు చెరో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సంఖ్యా బలం ప్రకారం 4 రాజ్యసభ సీట్లను డీఎంకే సునాయాసంగా గెలుచుకుటుంది.


కమల్ కాకుండా మరో ముగ్గురు అభ్యర్థులను డీఎంకే నిలబెట్టింది. కవి, తమిళ అధికార భాషా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ సల్మా, సీనియర్ అడ్వకేట్ పి.విల్సన్, మాజీ మంత్రి ఎస్.ఆర్.శివలింగంను తమ అభ్యర్థులుగా డీఎంకే ప్రకటించింది. జూన్ 19 రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి.


2018లో పార్టీ

కమల్‌హాసన్ 2018లో మదురైలో జరిగిన ఒక కార్యక్రమంలో మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రారంభించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయనప్పటికీ డీఎంకే సారథ్యంలోని 'ఇండియా' కూటమికి ప్రచారం చేసింది. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 2.62 శాతం ఓట్లు పడ్డాయి.


ఇవి కూడా చదవండి..

చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

బ్రిటిషర్ల కలను మీరు నిజం చేశారు.. ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసల జల్లు

For More National News and Telugu News..

Updated Date - Jun 06 , 2025 | 08:39 PM