Share News

Jharkhand: ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత మృతి..

ABN , Publish Date - May 24 , 2025 | 10:46 AM

Jharkhand Naxal Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఝార్ఖండ్‌లోని లతేహార్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర పోరాటం జరిగింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడు.

Jharkhand: ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత మృతి..
Security Forces Killed Moaists In Jharkhand

Security Forces Killed Moaists In Jharkhand: ఝార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులదే పై చేయి అయింది. మావోయిస్టు అగ్రనేత పప్పు లోహ్రాతో పాటు ఆయన సహచరుడు ఎదురు కాల్పుల్లో మరణించారు. అదే విధంగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక భద్రతా దళ సిబ్బంది కూడా గాయపడ్డారు.


జేజేఎంపీ ఛీఫ్ మృతి..

పోలీసుల సమాచారం ప్రకారం, లతేహార్‌లోని ఇచాబార్ అడవిలో భద్రతా దళాలు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఝార్ఖండ్‌ జన ముక్తి పరిషత్ (JJMP) చీఫ్ పప్పు లోహ్రా మృతి చెందాడు. ఇతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. ఇదే ఎన్‌కౌంటర్‌లో మరో జేజేఎంపీ మావోయిస్టు ప్రభాత్ గంజ్ కూడా హతమయ్యారు. అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. కాగా, ఈ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన ఓ మావోయిస్టు సజీవంగా పట్టుబడ్డాడు.


నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ భీకర కాల్పుల్లో గాయపడిన స్థితిలో JJMPకు చెందిన మావోయిస్టు సజీవంగా పట్టుబడ్డాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక INSAS రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేతకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ధృవీకరించారు. కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజ్ కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి

మానవత్వం మరిచిన పాక్.. 220 మంది ప్రాణాలతో చెలగాటం..

పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 12:34 PM