Home » Jharkhand
ఓ మెకానిక్ కేవలం నాలుగు లక్షల రూపాయలతో సూపర్ కారును తయారు చేశాడు. మారుతీ 800 కారును లంబోర్గినిగా మార్చేశాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
నియమ నిబంధనల తుచ తప్పకుండా పాటించే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. ఈ విషయంలో అతడికి జరిమానా కూడా పడింది.
సోమవారం రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన ‘ది బీచ్‌క్రాఫ్ట్ సీ90’ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం కుప్పకూలటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి కన్నీళ్లు పెట్టించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జార్ఖండ్ రాష్ట్రంలోని ఛత్రా జిల్లా అడవుల్లో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. 65 శాతం కాలిన గాయాలతో ఓ రోగిని ఢిల్లీకి తరలిస్తుండగా ఈ విషాదం నెలకొంది. ప్రమాదంలో పేషెంట్ సహా ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, డాక్టర్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
తన యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ రాలేదని ఓ యువకుడు స్టూడియోకు నిప్పు పెట్టిన ఉదంతం ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. యువకుడిని అతడి కుటుంబం ప్రస్తుతం రాంచీ ఆసుపత్రిలో చేర్పించింది.
సాధారణంగా రైలు వస్తున్న సమయంలో పట్టాల పైకి ఏ వాహనాలూ వెళ్లకుండా గేట్లు వేస్తారు. రైలు వెళ్లి పోయే వరకు గేట్ బయట వాహనాలు ఆగి ఉంటాయి. అయితే ఝార్ఖండ్‌లో ఓ రైల్వే గేట్ వద్ద ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది.
పెళ్లి ప్రయాణికుల బస్సు నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సు కింద చిక్కుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 85 మందికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 90 మందికి పైగా బస్సులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.
ఐఏఎస్ ఆఫీసర్‌నని చెప్పుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని ఝార్‌ఖండ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సివిల్స్‌లో విఫలమైన అతడు చివరకు ఇలా నకిలీ ఐఏఎస్‌లా మారి ఏడేళ్లుగా జనాలను బురిడీ కొట్టిస్తున్నట్టు గుర్తించారు.
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 టైటిల్‌ను జార్ఖండ్ కైవసం చోసుకుంది. హరియాణాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.
భారీ స్కామ్‌లలో జైలు పాలైన ఇద్దరు ఖైదీలు జైలు హాలులో రెచ్చిపోయారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.