Share News

Inmates Caught Dancing: జైల్లో రెచ్చిపోయిన ఖైదీలు.. పాటలు, డ్యాన్సులతో రచ్చ రచ్చ...

ABN , Publish Date - Nov 07 , 2025 | 06:52 PM

భారీ స్కామ్‌లలో జైలు పాలైన ఇద్దరు ఖైదీలు జైలు హాలులో రెచ్చిపోయారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

Inmates Caught Dancing: జైల్లో రెచ్చిపోయిన ఖైదీలు.. పాటలు, డ్యాన్సులతో రచ్చ రచ్చ...
Inmates Caught Dancing

జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ జైల్లో ఇద్దరు ఖైదీలు రెచ్చిపోయారు. పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఆ ఇద్దరూ పెద్ద పెద్ద స్కాముల్లో జైలు పాలైనవారు కావటంతో సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విధు గుప్తా అనే వ్యక్తి కోట్ల రూపాయల లిక్కర్ స్కాములో జైలు పాలయ్యాడు. విక్కీ భాటియా అనే వ్యక్తి జీఎస్టీ స్కామ్‌లో జైలు పాలయ్యాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నారు.


తాజాగా ఈ ఇద్దరూ జైలు హాలులో పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూ రెచ్చిపోయారు. దీన్ని అదే జైల్లో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జైలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు తక్షణ దర్యాప్తునకు ఆదేశించారు. అసిస్టెంట్ జైలర్ దేవ్‌నాథ్ రామ్, మరో అధికారి వినోద్ కుమార్ యాదవ్‌ల నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని దర్యాప్తులో తేలింది. దీంతో అధికారులు వారిని విధులోంచి తొలగించారు.


జైల్లోకి ఫోన్ ఎలా వచ్చింది? ఆ వీడియో రికార్డ్ చేసింది ఎవరు? అన్నదానిపై అధికారులు కూపీ లాగుతున్నారు. సాధారణ ఖైదీలకు వీఐపీ వసతులు కల్పించటంపై కూడా దృష్టి సారించారు. ఇక, ఈ సంఘటన జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘పెద్ద పెద్ద స్కామ్‌లు చేసి జైలుకెళ్లిన వారికి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఎక్కడైనా డబ్బున్న వారిదే రాజ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

నగల వ్యాపారి చేతిలో మహిళకు దేహశుద్ధి.. వీడియో వైరల్

ఫోన్ అడిక్షన్.. 25 ఏళ్లలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా?..

Updated Date - Nov 07 , 2025 | 06:57 PM