Share News

SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:09 PM

Spadex Docking: ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో మరో మైలురాయి. రెండో డాకింగ్ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తి భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు.

SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..
ISRO SPADEX Mission

ISRO Spadex Docking: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో మరో కీలక ముందడుగు పడింది. తొలి ప్రయోగంలో అంతరిక్షంలోనే ఉపగ్రహాలను అనుసంధానం చేసిన శాస్త్రవేత్తలు.. రెండో డాకింగ్ ప్రక్రియను కూడా సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. “ఉపగ్రహాల రెండవ డాకింగ్ విజయవంతంగా పూర్తయిందని తెలియజేయడానికి సంతోషంగా ఉంది” అని పేర్కొంటూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా ఇలా ట్వీట్ చేశారు.


"స్పేస్-బేస్డ్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (SPADEX) మిషన్‌ను PSLV-C60 ద్వారా డిసెంబర్ 30, 2024న ప్రయోగించాం. ఈ మిషన్‌లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు జనవరి 16, 2025న అంతరిక్షంలో తొలిసారి ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసి సృష్టించారు. అనంతరం మార్చి 13, 2025న ఉదయం 9:20 గంటలకు అన్‌డాక్ చేశాం" అని ఎక్స్ పోస్ట్ ద్వారా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ మిషన్ కింద రాబోయే రెండు వారాల్లో మరిన్ని ప్రయోగాలు జరగనున్నట్లు వెల్లడించారు.


మార్చి 13న, ఇస్రో తన SpaDeX మిషన్ లో భాగంగా స్పేస్ డీ-డాకింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. మన దేశం సొంతంగా అంతరిక్ష నౌకలు డాక్ చేయడానికి వీలు కల్పించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. భూమి నుంచి నావిగేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. చంద్రయాన్-4, 2035 కల్లా అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణం, మానవ సహిత అంతరిక్ష మిషన్లు వంటి భవిష్యత్ ప్రాజెక్టులకు ఈ సాంకేతికత చాలా అవసరం.


మిషన్ ప్రయోజనాలు

  • భారతదేశం 2035 లో తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని యోచిస్తోంది. ఈ మిషన్ విజయం దీనికి చాలా కీలకం. భారత అంతరిక్ష కేంద్రంలో ఐదు మాడ్యూళ్లు ఉంటాయి, వీటిని అంతరిక్షంలోకి తీసుకువస్తారు. వీటిలో మొదటి మాడ్యూల్ 2028 లో ప్రారంభమవుతుంది.

  •  ఈ మిషన్ చంద్రయాన్-4 వంటి మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్టులకు కూడా ముఖ్యమైనది. ఉపగ్రహ మరమ్మత్తు, ఇంధనం నింపడం, శిథిలాల తొలగింపు వంటి పనులు పూర్తిచేసేందుకు ఈ టెక్నాలజీ ఉపకరిస్తుంది.

  • ఒకేసారి ప్రయోగించలేని భారీ అంతరిక్ష నౌకలు, పరికరాలు అవసరమయ్యే మిషన్లకు ఈ సాంకేతికత చాలా ముఖ్యమైనది.


Read Also: China Hydrogen Bomb: చైనా సరికొత్త హైడ్రోజన్‌ బాంబు

Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య

Waqf Amendment Act: నువ్వు ఎన్నికల కమిషనర్‌ కాదు ముస్లిం కమిషనర్‌వి

Updated Date - Apr 21 , 2025 | 01:24 PM