Share News

IndiGo Flight: హైదరాబాద్‌ విమానం గన్నవరంలో ల్యాండింగ్‌..

ABN , Publish Date - Jul 02 , 2025 | 06:18 AM

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో దిగింది.

IndiGo Flight: హైదరాబాద్‌ విమానం గన్నవరంలో ల్యాండింగ్‌..

విజయవాడ, జూలై 1(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో దిగింది. ఈ విమానం 214 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరగా అక్కడ వాతావరణం అనుకూలించలేదు. దీంతో రాత్రి 9.20 గంటలకు విజయవాడలో దిగింది. ముగ్గురు ప్రయాణికులు విజయవాడలో దిగిపోగా, మిగిలినవారితో రాత్రి 9.50 గంటలకు విమానం తిరిగి హైదరాబాద్‌కు పయనమైంది.


ఇదిలా ఉండగా, ఎయిర్‌ ఇండియాకు చెందిన మరో విమానం ఘోర ప్రమాదం నుంచి తప్పింది, ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగిన 38 గంటలలోపే ఆ ఘటన జరిగింది. ఢిల్లీ, వియన్నా మధ్య ప్రయాణిస్తున్న బోయింగ్‌ 777 విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత కొద్దిసేపటికి ఉన్నట్టుండి 900 అడుగులు కిందకి జారిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అదుపులోనికి తీసుకొచ్చి మరో పెద్ద ప్రమాదాన్ని నివారించారు. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

Updated Date - Jul 02 , 2025 | 06:22 AM