Share News

World Police and Fire Games: ప్రపంచ పోలీసు క్రీడా పోటీలకు భారత్ ఆతిథ్యం

ABN , Publish Date - Jun 27 , 2025 | 07:30 PM

ప్రపంచ పోలీసు క్రీడల ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికైంది. ప్రతిష్టాత్మకమైన 2029 ప్రపంచ పోలీస్, అగ్నిమాపక క్రీడలకు అహ్మదాబాద్ వేదిక అయింది. ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు.

World Police and Fire Games: ప్రపంచ పోలీసు క్రీడా పోటీలకు భారత్ ఆతిథ్యం
World Police and Fire Games

ఢిల్లీ: ప్రపంచ పోలీసు క్రీడల ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికైంది. ప్రతిష్టాత్మకమైన 2029 ప్రపంచ పోలీస్, అగ్నిమాపక క్రీడలకు (World Police and Fire Games) అహ్మదాబాద్ వేదిక అయింది. ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమిత్‌ షా ఇవాళ(శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి భారత పౌరుడికి ఇది గొప్ప గర్వకారణమని అమిత్‌ షా పేర్కొన్నారు. పోలీసు క్రీడల నిర్వహణకు భారత్ ప్రతిష్టాత్మక బిడ్‌ను గెలుచుకుందని అమిత్‌ షా తెలిపారు.


కేంద్ర ప్రభుత్వం నిర్మించిన విస్తారమైన క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. 1985 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ పోలీసు, అగ్నిమాపక క్రీడలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 20 సార్లు ప్రపంచ క్రీడలు జరిగాయి.


ఎనిమిదిసార్లు అమెరికా, ఐదుసార్లు కెనడా, నాలుగుసార్లు యూరప్‌, రెండుసార్లు బ్రిటన్‌, ఒకసారి చైనా నిర్వహించింది. 2007లో అడిలైట్‌లో జరిగిన క్రీడల్లో తొలిసారి ఇండియన్‌ పోలీస్‌ కంటింజెంట్‌ పాల్గొంది. 2023 కెనడాలో జరిగిన 20 పోలీసు క్రీడల్లో 343 పథకాలను 133 మంది పోలీసు సిబ్బంది గెలుచుకున్నారు. వీటిలో 224 బంగారు, 82 వెండి, 37 కాంస్య పథకాలు ఉన్నాయి. 2007 నుంచి 2023 వరకు 1400 పథకాలను భారత పోలీసు సిబ్బంది గెలుచుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌డౌన్.. ఎందుకంటే

రథయాత్రలో అపశ్రుతి.. బీభత్సం సృష్టించిన ఏనుగు..

For More National News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 08:26 PM