Share News

Defense Ministry Agreement: భారత సైన్యం అసాల్ట్ రైఫిల్‌లకు సరికొత్త నైట్ సైట్‌..

ABN , Publish Date - Oct 16 , 2025 | 08:28 AM

రైఫిల్ సమర్థవంతమైన పరిధిని పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తాయి. భారతదేశంలోనే ఈ నైట్ సైట్‌లను తయారు చేయడానికి MKU లిమిటెడ్, మెడ్‌బిట్ టెక్నాలజీస్ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకుంది.

Defense Ministry Agreement: భారత సైన్యం అసాల్ట్ రైఫిల్‌లకు సరికొత్త నైట్ సైట్‌..
Indian Army

ఢిల్లీ: భారత సైన్యం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సైన్యానికి SIG 716 అసాల్ట్ రైఫిల్‌లకు సరికొత్త నైట్ సైట్‌లను అందించడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిన్న(బుధవారం) ఒప్పందంపై సంతకం చేసింది. అనుబంధ ఉపకరణాలతో పాటు 7.62x51 మిమీ SIG 716 అసాల్ట్ రైఫిల్ కోసం నైట్ సైట్స్ కోసం రూ.659.47 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఈ నైట్ సైట్‌లు తక్కువ కాంతిలో లేదా రాత్రిపూట సైనికులు సమర్థవంతంగా కాల్పులు జరపడానికి సహాయపడతాయి.


అలాగే రైఫిల్ సమర్థవంతమైన పరిధిని పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తాయి. భారతదేశంలోనే ఈ నైట్ సైట్‌లను తయారు చేయడానికి MKU లిమిటెడ్, మెడ్‌బిట్ టెక్నాలజీస్ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకుంది. నైట్ సైట్లు స్టార్లిట్ పరిస్థితులలో కూడా 500 మీటర్ల సమర్థవంతమైన లక్ష్యాలను చేధిస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైఫిల్‌కు అమర్చబడిన నైట్ సైట్స్‌ గణనీయమైన మెరుగుదలను అందిస్తాయన్నారు.


ఈ ఒప్పందం 51 శాతానికిపైగా దేశీయ రక్షణ తయారీలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఇది దేశీయ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలను పెంచుతుంది. అలాగే.. తయారీ ముడిసరుకు సరఫరా చేస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తుంది.


ఇవి కూడా చదవండి..

Transgenders Hospitalized in Delhi: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు

The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి

Updated Date - Oct 16 , 2025 | 12:00 PM