Share News

MUDA Case: ముడా భూముల కేసులో సీఎంకు ఊరట

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:34 PM

లోకాయుక్త ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున లోకాయుక్త పోలీసులు సమర్ధవంతంగా విచారణ జరపలేరని పిటిషనర్ వాదించారు. లోకాయుక్త, సీబీఐ, మరే ఇతర దర్యాప్తు సంస్థతోనైనా దీనిపై దర్యాప్తు జరిపించాలని పిటిషన్‌ కోరారు.

MUDA Case: ముడా భూముల కేసులో సీఎంకు ఊరట

బెంగళూరు: మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఊరట లభించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు (Karnatka High Court) శుక్రవారంనాడు కొట్టివేసింది. సిద్ధరామయ్య కుటుంబానికి 2021లో మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ మంజూరు చేసిన భూముల కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ వేసిన పిటిషన్‌పై హైకోర్టు గత జనవరి 27న తీర్పును రిజర్వ్ చేసింది.

PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్న మోదీ


లోకాయుక్త ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున లోకాయుక్త పోలీసులు సమర్ధవంతంగా విచారణ జరపలేరని పిటిషనర్ వాదించారు. లోకాయుక్త, సీబీఐ, మరే ఇతర దర్యాప్తు సంస్థతోనైనా దీనిపై దర్యాప్తు జరిపించాలని పిటిషన్‌ గతంలో కోరారు. దీంతో లోకాయుక్త పోలీసులతో విచారణకు ప్రత్యేక కోర్టు 2024 సెప్టెంబర్ 25న ఆదేశించింది. కాగా, దీనిపై లోకాయుక్త పోలీసుల ఎఫ్ఐఆర్ ననమోదుకు చేసేందుకు సిద్ధమవుతుండటంతో దీనికి కొద్ది గటంల ముందే పిటిషనర్ హైకోర్టును అశ్రయించారు. దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు.


లోకాయుక్త పోలీసుల విచారణను నివేకదిను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నాగప్రసన్న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషన్‌పై తీర్పును వాయిదా వేశారు. ముఖ్యమంత్రి తరఫు లాయర్ హైకోర్టులో తన వాదన వినిపిస్తూ, లోకాయుక్త పోలీస్ ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించిన ప్రత్యేక కోర్టు పరిధిలోకి ఈ అంశం వస్తుందని, సీబీఐ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌పై హైకోర్టు సుమోటో నిర్ణయం తీసుకోలేదని అన్నారు.


సిద్ధరామయ్య భార్యకు 2010లో గిఫ్ట్‌గా వచ్చిన 3.16 ఎకరాల భూమిని తీసుకున్న హుడా రూ.56 కోట్లు విలువచేసే 14 స్థలాలను కేటాయించిందనేది ఈ కేసులో కీలకాంశం. అయితే, భూముల కేటాయింపులో తామెలాంటి తప్పులు చేయేదని సిద్ధరామయ్య వాదనగా ఉంది. తన సతీమణి తీసుకున్న భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేశారు. ముడా భూముల కేటాయింపుల్లో అవకతలపై విచారణకు ఆదేశిస్తూ ఏకసభ్య న్యాయమూర్తి 2024 సెప్టెంబర్ 24న ఇచ్చిన తీర్పును సైతం సిద్ధరామయ్య హైకోర్టులో సవాలు చేశారు. మార్చి 22న ఈ అప్పీల్‌పై విచారణ జరుపనుంది.


ఇవి కూడా చదవండి..

AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2025 | 03:35 PM