Share News

Amit Shah: 2026లో తమిళనాట బీజేపీ గెలుపు తథ్యం

ABN , Publish Date - Jun 08 , 2025 | 08:18 PM

తమిళనాట అధికార డీఎంకే అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 10 శాతం హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్ని వాగ్దానాలు అమలు చేశారో జాబితా ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సవాలు చేశారు.

Amit Shah: 2026లో తమిళనాట బీజేపీ గెలుపు తథ్యం
Amit Shah

చెన్నై: వచ్చే ఏడాది జరిగే తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) సారథ్యంలోని కూటమి విజయం సాధించడం తథ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు. అవినీతి డీఎంకే పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. తమిళనాడులోనే కాకుండా పశ్చిమ బెంగాల్‌లోనూ కమలం పార్టీ సత్తా చాటుతుందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి కార్యకర్తలతో మధురైలో ఆదివారం నాడు జరిగిన సమావేశంలో అమిత్‌షా ప్రసంగించారు.


మోదీ నిధులు ప్రజలకు చేరడం లేదు..

అధికార డీఎంకే అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 10 శాతం హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్ని వాగ్దానాలు అమలు చేశారో జాబితా ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సవాలు చేశారు. తమిళంలో ఇంజనీరింగ్ విద్యతో సహా హైయర్ ఎడ్యుకేషన్‌ను పట్టుంచుకోవడం లేదన్నారు. కల్తీ మద్యం మరణాల నుంచి టీఏఎస్‌ఎంఏసీలో రూ.39,000 కోట్ల స్కామ్‌ వరకూ డీఎంకే 100 శాతం విఫల ప్రభుత్వంగా నిలిచిందని ఆరోపించారు. స్టాలిన్ ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేసిందని, కీలకమైన అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ప్రధాని మోదీ పంపించే నిధులు తమిళనాడు ప్రజలకు చేరడం లేదని, వాటిని డీఎంకే దారి మళ్లిస్తోందని ఆరోపించారు.


ఎన్నికల కదనరంగం

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ కార్యకర్తలందరికీ చాలా కీలకమని, ప్రతిఒక్కరూ చేతులు పైకెత్తి విజయ సంకల్పం చేయాలని అమిత్‌షా ఉత్తేజపరిచారు. బీజేపీ ఇటీవల సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. ఒడిశాలో గెలిచామని, హర్యానాలో అధికారాన్ని నిలుపుకున్నామని, 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చామని చెప్పారు. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్వభజన వల్ల తమిళనాడుకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతుందంటూ డీఎంకే ఆందోళనపై మాత్రం అమిత్‌షా ఎలాంటి ప్రస్తావన చేయలేదు.


ఇవి కూడా చదవండి..

హిందీపై కమల్ హాసన్ హాట్ కామెంట్స్

లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తాం.. రాహుల్‌‌ వ్యాఖ్యలపై ఈసీ

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 09:51 PM