Share News

DK Shivakumar: నా నమ్మకాలు నావి..ఎక్కడికైనా వెళ్తా: డీకే

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:45 PM

ఇషా పౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తన వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయమని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరికీ సమాధానం ఇవ్వాల్సిన పని తనకు లేదని డీకే శివకుమార్ అన్నారు.

DK Shivakumar: నా నమ్మకాలు నావి..ఎక్కడికైనా వెళ్తా: డీకే

బెంగళూరు: ఇషా ఫౌండేషన్‌ నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనడాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivkumar) సమర్ధించుకున్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. అన్ని మతాలు, కులాలను తాను విశ్వసిస్తానని, సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్లాలన్నదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. ''నాకు ఎలాంటి తేడాలు లేవు. కొందరికి అది నచ్చవచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు'' అంటూ డీకే సూటిగా సమాధానం ఇచ్చారు.

Chamoli Avalanchi: ఆరుకు చేరిన మృతులు.. చివరి ఇద్దరి కార్మికుల కోసం గాలింపు


కర్ణాటకతో సద్గురు జగ్గీ వాసుదే‌వ్‌కు అనుబంధం ఉందని, కావేరీ జలాల అంశంలోనూ ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్ ఉందని డీకే తెలిపారు. ''సద్దురు కర్ణాటకకు చెందిన వారు. కావేరీ జలాల కోసం పోరాడారు. ఆయన వ్యక్తిగతంగా నన్ను ఆహ్వానించారు. ఆయనకు ఎందరో అభిమానగణం ఉన్నారు. వివిధ పార్టీలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, నేతలు కూడా హాజరయ్యారు. నాకున్న వ్యక్తిగత నమ్మకం కారణంగానే నేను కూడా వెళ్లాను'' అని డీకే వివరణ ఇచ్చారు.


గతంలో తనపై వచ్చిన విమర్శలను డీకే ప్రస్తావిస్తూ, తన నియోజకవర్గంలో 100 అడుగుల జీసస్ విగ్రహాన్ని స్థానికులు గతంలో ఏర్పాటు చేశారని, అది జరిగినప్పుడు బీజేపీ నేతలు తనను 'ఏసుకుమార' అంటూ సంబోధించారని చెప్పారు. ఇషా పౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తన వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయమని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరికీ సమాధానం ఇవ్వాల్సిన పని తనకు లేదని అన్నారు. తన చర్యను బీజేపీనో, ఇంకెవరో స్వాగతించాలని తాను కోరుకోవడం లేదన్నారు. మీడియా కూడా దీనిపై చర్చించాల్సిన పని లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయమని వివరించారు. సద్గురు స్వయంగా మైసూరుకు చెందిన వ్యక్తి కావడంతో పాటు ఈ ఈవెంట్‌కు రావాలని ఆయన తనను వ్యక్తిగతంగా కోరారని చెప్పారు.


''నా నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీల మెజారిటీ ఉంది. నియోజకవర్గంలోని 99 శాతం బ్రాహ్మణుల ఓట్లు నాకు పడ్డాయి. బ్రాహ్మణుల ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయని చెప్పగలమా? నేను ఎన్నడూ కుల, మత రాజకీయాలు చేయలేదు. సిద్ధాంతాలతో కూడిన రాజకీయాలకే నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను'' అని డీకే చెప్పారు. బీజేపీకి తాను దగ్గరవుతున్నానంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు. తాను కాంగ్రెస్‌లోనే పుట్టానని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి

Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 04:48 PM