Share News

High Court: మాజీ మంత్రికి హైకోర్టు నోటీసు

ABN , Publish Date - Jan 22 , 2025 | 10:54 AM

అన్నాడీఎంకే నేత, మాజీమంత్రి రాజేంద్రబాలాజీ(Former Minister Rajendra Balaji)కి మద్రాస్‌ హైకోర్టు నోటీసులిచ్చింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమల శాఖా మంత్రిగా వ్యవహరించిన రాజేంద్రబాలాజీ, అన్నాడీఎంకే నాయకుడు విజయ నల్లతంబి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించి నగదు మోసానికి పాల్పడినట్లు విరుదునగర్‌(Virudu Nagar) జిల్లా ఆర్థిక నేరవిభాగంలో రవీంద్రన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

High Court: మాజీ మంత్రికి హైకోర్టు నోటీసు

చెన్నై: అన్నాడీఎంకే నేత, మాజీమంత్రి రాజేంద్రబాలాజీ(Former Minister Rajendra Balaji)కి మద్రాస్‌ హైకోర్టు నోటీసులిచ్చింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమల శాఖా మంత్రిగా వ్యవహరించిన రాజేంద్రబాలాజీ, అన్నాడీఎంకే నాయకుడు విజయ నల్లతంబి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించి నగదు మోసానికి పాల్పడినట్లు విరుదునగర్‌(Virudu Nagar) జిల్లా ఆర్థిక నేరవిభాగంలో రవీంద్రన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 2021వ సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చార్జిషీటు దాఖలు చేసేలా పోలీసులకు ఉత్తర్వులివ్వాలని కోరుతూ హైకోర్టు(High Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Instagram: నేను మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా.


nani1.2.jpg

అందులో ఉద్యోగాల కోసం నగదు ముట్టజెప్పి మోసపోయిన వారిని రాజేంద్ర బాలాజీ బెదిరించినట్లు ఆధారాలతో సమర్పించిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి వేలుమురుగన్‌.. నాలుగు వారాల్లోగా సమగ్ర వివరాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాజేంద్ర బాలాజీకి నోటీసు జారీ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే

ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్‌ గుట్టు రట్టు!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 22 , 2025 | 10:54 AM