Heavy Rain: ఉత్తరాదిని వణికిస్తున్న వానలు..
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:35 PM
ఉత్తర కర్ణాటక జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, బాగల్‌కోట, బెళగావి జిల్లాల్లో నదులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల సమీపంలో ఉన్న గ్రామాలు నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది.

- పొంగి ప్రవహిస్తున్న నదులు
- నీట మునిగిన గ్రామాలు
- వంతెనలపై ప్రవహిస్తున్న నీరు
బళ్లారి(బెంగళూరు): ఉత్తర కర్ణాటక జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. బళ్లారి, విజయనగర, కొప్పళ, రాయచూరు, బాగల్‌కోట, బెళగావి జిల్లాల్లో నదులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదుల సమీపంలో ఉన్న గ్రామాలు నీట మునిగాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. వంతెనలపై నీరు పారుతున్నాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. కొన్నిచోట్ల దేవాలయాల్లోకి నీరు చేరాయి. ఘటప్రభ నదిలో వరద నీరు విపరీతంగా పెరిగింది.
బాగల్‌కోట(Bagankota) జిల్లాలోని ముధోల్ తాలూకాలో నదిపై నిర్మించిన 8 వంతెనలు, అలాగే బ్యారేజీలు మునిగిపోయాయి. వరద కారణంగా ముథోల్ పరిసరాల్లోని మిర్జి, మలాలి, ఒంటిగోడ, మాచేనూర్ ఇతర గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. మాచనూర్ గ్రామంలోని హోళేబసవేశ్వర ఆలయం నీట మునిగింది. భక్తులు ఆలయంలోకి వెళ్లడం కష్టంగా మారడంతో ఒడ్డునే దర్శనం చేసుకుని వెళుతున్నారు.
బళ్లారి జిల్లా కంప్లి, కొప్పళ జిల్లా గంగావతి మధ్య తుంగభద్ర(Tungabhdra) నది పొంగి ప్రవహిస్తోంది. నదిలో 1.10 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నాయి. గంగావతి, కంప్లి ప్రాంతాల్లో మూడు రోజులుగా వంతెనలు నీటిలోనే ఉన్నాయి. రాకపోకలు నిల్చిపోయాయి. కంప్లి నుంచి గంగావతి వైపు వెళ్లే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం లేదు. గర్భిణులు, రోగులు వైద్యం కోసం గంగావతి(Gangavati)కి కాకుండా బళ్లారికి వెళుతున్నారు.
కంప్లి, సిరుగుప్ప రహదారిపై నారిహళ్లి వంతెన నీటమునిగింది. వరద కాస్త తగ్గుముఖం పట్టినట్టే పట్టి తిరిగి పెరుగుతుండడంతో జనజీవనం అతలాకుతలం అయింది. రైతులు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. ఇక నది ఆధారంగా జీవనం సాగించే వారు కూడా నదివైపు వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో నుంచి వివిధ ప్రాంతాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు
ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం
Read Latest Telangana News and National News