Rains: ఆరు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:07 AM
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం, పడమటి గాలుల వేగం కారణంగా రాష్ట్రంలో మంగళవారం నుండి ఆరు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. 16 నుండి 17 వరకు చెన్నై సహా ఆరుజిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

చెన్నై: బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం, పడమటి గాలుల వేగం కారణంగా రాష్ట్రంలో మంగళవారం నుండి ఆరు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. 16 నుండి 17 వరకు చెన్నై(Chennai) సహా ఆరుజిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం సాయంత్రం ఏర్పడిన అల్ప పీడనం ఉత్తర దిశగా కదులుతూ వాయువ్యదిశగా పయనించి సోమవారం వేకువజాము 5.30 గంటలకు వాయుగుండంగా మారి బంగ్లాదేశ్ సమీపంలో కేంద్రీకృతమైంది.
ఈ వాయుగుండం కారణంగా పడమటి గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలోను, పుదుచ్చేరిలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కి.మీ.ల వేగంతో గాలులు వీచాయి. దీంతో నీలగిరి జిల్లాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూరు సహా 6 జిల్లాల్లో ఈ నెల 16 నుండి 17 వరకు కుండపోతగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రతీర ప్రాంతాల నుండి రాష్ట్రం వైపు వీచే పడమటి గాలుల వేగంలో మార్పుల కారణంగా మంగళవారం నుండి పలు చోట్ల చెదురుమదురుగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
కోవై, నీలగిరి జిల్లాల్లో మంగళవారం భారీగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈ నెల 16, 17 తేదీలలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట, నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని వివరించారు. తేని, దిండుగల్ జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నెల 18న రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాల్లోను, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోను ఉరుములు, మెరుపులతో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
ఆ సందర్భంగా గంటకు 40 నుండి 50 కి.మీల. వేగంతో పెనుగాలులు వీస్తాయన్నారు. నీలగిరి,కోయంబత్తూరు జిల్లాల్లో పర్వతశ్రేణుల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని, తేని, తెన్‌కాశి, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, విల్లుపురం, కళ్ళకురిచ్చి, కడలూరు జిల్లాల్లోను, పుదుచ్చేరి రాష్ట్రంలోనూ భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 19 నుండి 20 వరకు రాష్ట్రంలోని కొన్నిచోట్ల, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయి.
జాలర్లకు హెచ్చరిక...
ఇదిలా ఉండగా ఈ నెల 18న దక్షిణాది జిల్లాల్లోని సముద్రతీర ప్రాంతాల్లో, ప్రత్యేకించి మన్నార్‌జలసంది ప్రాంతంలో గంటలకు 45 నుండి 55 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రపు అలలు ఉదృతంగా ఎగసిపడే అవకాశాలున్నాయని, ఈ కారణంగా జాలర్లు ఆ రోజు చేపలవేటకు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య
Read Latest Telangana News and National News