Share News

Heavy Rains: 2 నుంచి నాలుగు రోజులు భారీవర్షాలు..

ABN , Publish Date - Jul 31 , 2025 | 09:44 AM

పడమటి గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఆగస్టు 2 నుంచి 5వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Heavy Rains: 2 నుంచి నాలుగు రోజులు భారీవర్షాలు..

చెన్నై: పడమటి గాలుల వేగంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో ఆగస్టు 2 నుంచి 5వ తేది వరకు ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... తిరువారూరు, నాగపట్టణం, మైలాడుదురై, పుదుకోట(Thiruvarur, Nagapattinam, Mylapore, Pudukkottai)


nani1.2.jpg

తదితర జిల్లాలు, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముంది. రాజధాని నగరం చెన్నై(Chennai)లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ పగటి ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 28-29 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు

ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 31 , 2025 | 09:44 AM