Share News

Tungabhadra: తుంగభద్రలోకి భారీగా వరద నీరు..

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:52 PM

తుంగభద్ర రిజర్వాయర్‏లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో నీరు పెద్దఎత్తున వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 21.091 టీఎంసీల నీరు నిలువ ఉంది.

Tungabhadra: తుంగభద్రలోకి భారీగా వరద నీరు..

- ఆయకట్టు రైతుల్లో హర్షం

బళ్లారి(బెంగళూరు): రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో గత ఏడాది కంటే ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Reservoir) 15 రోజుల ముందు నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం కొత్తనీటితో తుంగభద్ర జలాశయం జలకళను సంతరించుకుంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం పైభాగం పశ్చిమ కనుమల్లోని ఖుదరేముఖ, వరునాడు, అగుంబె తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర జలాశయాలు నుంచి అధిక మొత్తంలో వరదనీరు వచ్చి చేరుతోంది.


pandu1.2.jpg

ఇప్పటి శివమొగ్గ(Shivamogga) జిల్లాలో ఉన్న తుంగ జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో దిగువకు వరద నీటిని వదులుతున్నారు. ఆ నీరంతా నేరుగా తుంగభద్ర జలాశయానికి వచ్చి చేరుతుండడంతో రోజు రోజుకూ తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో వదర నీటి చేరిక పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయం 1599.66 అడుగులకు నీరు చేరగా, సరాసరి 7,905 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 21.091 టీఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయంలో కేవలం 517 క్యూసెక్కుల చేరుతుండగా, 3.05 టీఎంసీల నీరు నిలువ ఉండేదని జలాశయం అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..

బనకచర్లపై ఉత్తమ్‌, కవిత తప్పుడు ప్రచారం: బక్కని

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2025 | 12:52 PM