Unified Pension Scheme: ఏప్రిల్ 1 నుంచి కొత్త యూనిఫైడ్ పెన్షన్ విధానం
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:32 PM
నేషనల్ పెన్షన్ సిస్టంలో రిజిస్టర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఎస్ ఆపరేషనల్ వ్యవహారాలకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డవలప్‌మెంట్ అథారిటీ త్వరలోనే నిబంధనలను విడుదల చేస్తుందని వెల్లడించింది.

న్యూఢిల్లీ: జాతీయ నేషనల్ ఫెన్షన్ స్కీమ్ (NPS)లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శుభవార్త. ఎన్‌పీఎస్‌లో ఉన్న వారు కొత్త పెన్షన్ స్కీమ్ 'యూపీఎస్' (Unified pension Scheme) ప్రయోజనాలను త్వరలోనే అందుకోనున్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 2025 ఏప్రిల్ 1 నుంచి అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా కనీసం పదేళ్లు సేవలందించిన వారికి యూపీఎస్ కింద రూ.10,000 పెన్షన్ లభిస్తుంది.
Republic Day : న్యూఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
నేషనల్ పెన్షన్ సిస్టంలో రిజిస్టర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఎస్ ఆపరేషనల్ వ్యవహారాలకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డవలప్‌మెంట్ అథారిటీ త్వరలోనే నిబంధనలను విడుదల చేస్తుందని కూడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఎస్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమై యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలపై ఆమోదం తెలిపింది.
యూపీఎస్ కింద పదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు రిటైర్ అయిన తేదీ నుంచి పెన్షన్ అందుతుంది. 25 ఏళ్లు, అంతకంటే ఎక్కువ సర్వీసు తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటే మాత్రం ఆ ఉద్యోగులకు సాధారణ రిటైర్మెంట్ తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది. ఉద్యోగం మానేసిన వారికి, ఉద్యోగం నుంచి తొలగించిన వారికి యూపీఎస్ ప్రయోజనాలు వర్తించవు.
ఇవి కూడా చదవండి:
Republic Day 2025: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్..