Rahul Gandhi: అవును, ట్రంప్ చెప్పింది నిజమే.. భారత్‌ది ఒక డెడ్ ఎకానమీ: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:18 PM
ఇండియన్ ఎకానమీ గురించి అమెరికా అధ్యక్షుడు చేసిన సంచలన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ పూర్తిగా సమర్థించారు. ట్రంప్ చెప్పినట్టు ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీనే అంటూ కామెంట్స్ చేశారు.

న్యూఢిల్లీ, జులై 31: ఇండియన్ ఎకానమీ గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల గాంధీ పూర్తిగా సమర్థించారు. ట్రంప్ చెప్పినట్టు ఇండియన్ ఎకానమీ.. డెడ్ ఎకానమీనే అని రాహుల్ అన్నారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది నిజమేనని.. ప్రధాని మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థను చంపేశారని సంచలన కామెంట్స్ చేశారు. మోదీ నే దేశ ఎకానమీని చంపేశారన్నారు. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ట్రంప్ చేసిన కామెంట్స్ పై రాహుల్ రియాక్ట్ అయ్యారు.
అవును, ట్రంప్ చెప్పింది వాస్తవమే.. ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ ఈ విషయం తెలుసునని రాహుల్ గాంధీ అన్నారు. ట్రంప్ వాస్తవాన్ని వెల్లడించినందుకు సంతోషిస్తున్నానని చెప్పారు. ఇందులో ఆశ్చర్యం లేదని, అదానీకి సహాయం అందించడం కోసం బిజెపి ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని అన్నారు.
కాగా, ఇండియా మీద అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిన్నటి నుంచి వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ పై 25 శాతం సుంకంతోపాటు జరిమానా కూడా విధిస్తామని ప్రకటన చేసిన ట్రంప్.. ఆ తర్వాత ఇండియాది డెడ్ ఎకానమి అంటూ వ్యాఖ్యానించారు. ఇండియా.. రష్యాతో స్నేహం కోరుకుంటోందని.. కానీ రష్యా లాగే ఇండియన్ ఎకానమీ కూడా డెడ్ ఎకానమీ అని ట్రంప్ అన్నారు. ఈ రెండు దేశాలు పతనమైన ఆర్థిక వ్యవస్థలను మరింత కిందికి తీసుకెళతాయని, అయితే దానిని తాను అస్సలు పట్టించుకోనంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
ఏడేళ్లలో 42 సార్లు రిజెక్ట్ చేసింది.. 43వ సారి మాత్రం..
2 గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?..