Share News

Saif Ali Khan Stabbing Cae: సైఫ్ అలీపై దాడి కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే

ABN , Publish Date - Jan 27 , 2025 | 06:08 PM

సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఫకీర్‌ను బంగ్లాదేశీయుడుగా పోలీసులు గుర్తించారు. అతను వాడిన సిమ్‌ ఒక మహిళ పేరుతో రిజిస్టర్ కావడాన్ని గుర్తించారు. దీనిపై ఆరా తీసేందుకు ఇద్దరు సభ్యుల ముంబై టీమ్ ఆదివారంనాడు పశ్చిమబెంగాల్ వెళ్లింది.

Saif Ali Khan Stabbing Cae: సైఫ్ అలీపై దాడి కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే

ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan)పై ముంబై రెసిడెన్స్‌లో దాడి జరిగిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ముంబై పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో గాలింపు చర్యల్లో భాగంగా ఈ అరెస్టు చోటుచేసుకుంది. దాడి నిందితుడు ఫకీర్‌తో ఆమెకున్న సంబంధాలపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.

MUDA Scam: ముడా స్కామ్‌లో కీలక పరిణామం

సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఫకీర్‌ను బంగ్లాదేశీయుడుగా పోలీసులు గుర్తించారు. అతను వాడిన సిమ్‌ ఒక మహిళ పేరుతో రిజిస్టర్ కావడాన్ని గుర్తించారు. దీనిపై ఆరా తీసేందుకు ఇద్దరు సభ్యుల ముంబై టీమ్ ఆదివారంనాడు పశ్చిమబెంగాల్ వెళ్లింది.

కాగా, ఛాప్రా నదియా జిల్లాలో ఖుఖుమోని జహంగీర్ షేక్ అనే మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేయారని, ముంబైకి ఆమెను తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ రిమాండ్‌కు దరఖాస్తు చేయనున్నారని బెంగాల్ పోలీసులు తెలిపారు. షరీఫుల్ ఫకీర్ గురించి ఆమెకు తెలుసునని చెప్పారు. నార్త్ బెంగాల్‌ సిలిగురి సమీపంలోని ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుగుండా అక్రమంగా ఇండియాలోకి చొరబడిన షరీఫుల్‌.. జహంగీర్‌ షేక్‌తో సంప్రదింపులు సాగించేవాడని, ఆమె పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లా ఆండులియా నివాసి అని ఆ వర్గాలు వెల్లడించాయి.

Sanatan Vedic Nation : సనాతన వైదిక దేశమే లక్ష్యం

India IST Now : ఇక నుంచి భారత్‌లో.. వన్ టైమ్.. వన్ నేషన్..

Saif Ali Attack Case: ఉద్యోగం, పెళ్లి రెండూ పోయాయి.. దాడి అనుమానితుడి ఆవేదన

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 27 , 2025 | 07:07 PM