Share News

Emergency: కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ'కి యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

ABN , Publish Date - Jan 24 , 2025 | 07:23 PM

ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద మాస్కులు ధరించిన కొందరు ఖలీస్థానీ సానుభూతి పరులు బెదరింపులకు పాల్పడినట్టు వార్తలు రావడంపై వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ స్పందించారు.

Emergency: కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ'కి యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1975 నుంచి 1977 వరకూ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడం, అప్పటి పరిణామాలను ఆధారంగా చేసుకుని కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయదర్శకత్వంలో నటించిన 'ఎమర్జెన్సీ' (Emergencey) చిత్రానికి బ్రిటన్‌లో ఎదరువుతున్న అడ్డంకులపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ విషయంలో ఎలాంటి వివక్ష చూపరాదని, అడ్డంకులు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు.

Liquor Ban: 17 మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం..క్యాబినెట్ నిర్ణయం


ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద మాస్కులు ధరించిన కొందరు ఖలీస్థానీ సానుభూతి పరులు బెదరింపులకు పాల్పడినట్టు వార్తలు రావడంపై వారాంతపు మీడియా సమావేశంలో జైశ్వాల్ స్పందించారు. ''యూకేలోని పలు థియేటర్లలో ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారంటూ వస్తున్న కథనాలు మా దృష్టికి వచ్చాయి. భారత వ్యతిరేక మూకల నుంచి ఎదురవుతున్న హింసాత్మక నిరసనలు, బెదిరింపుల ఘటనలను యూకే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తూనే ఉన్నాం. భావ ప్రకటానా స్వేచ్ఛ విషయంలో విపక్ష కూడదు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. యూకే ప్రభుత్వం ఆ దేశగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. లండన్‌లోని భారత రాయబార కార్యాలయంతో అక్కడి భారతీయలు భద్రతపై ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం'' అని జైశ్వాల్ తెలిపారు.


ఎమర్జెన్సీ చిత్ర గత శుక్రవారం యూకేలో విడుదలైనప్పటి నుంచి కొన్ని బ్రిటిష్ సిక్కు గ్రూపులు నిరసనలు తెలుపుతూ, పలు థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేసినట్టు కథనాలు వెలువడ్డాయి. ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ రీజియన్‌లో బిర్మింగ్‌హామ్, వాల్వెర్‌హాంప్టన్‌లోని నిరసనల కారణంగా చిత్ర పదర్శనలు నిలిచిపోయాయి. గత ఆదివారంనాడు హ్యారో వ్యూ సినిమా థియేటర్‌లో అరగంట ప్రదర్శన తర్వాత కొందరు మాస్కులు ధరించిన ఖలిస్థానీయులు అడుగుపెట్టి అడియన్లను బెదరించడం, సినిమాను బలవంతంగా నిలిపివేయడంపై కన్జర్వేటివ్ సభ్యుడు బాబ్ బ్లాక్‌మన్ కూడా పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. సిక్కు వ్యతిరేక చిత్రంగా కొన్ని శక్తులు భావిస్తూ ఉండవచ్చని, అయితే రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉందని అన్నారు. దుండగుల తరహాలో బెదరించడం, స్వేచ్ఛగా సినిమాలు చూసే ప్రజాస్వామిక హక్కును కాలరాయడం తగదన్నారు.


ఇవి కూడా చదవండి..

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 24 , 2025 | 07:23 PM