EPS: తేల్చేశారు.. ఆ పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వబోం..
ABN , Publish Date - Apr 17 , 2025 | 10:07 AM
మరో ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే, మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు.

- ఎడప్పాడి స్పష్టీకరణ
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శాసనసభ నుంచి అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్ చేసిన తర్వాత అసెంబ్లీ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే యేడాది శాసనసభ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే, బీజేపీ తదితర పార్టీలతో ఏర్పాటయ్యే మెగా కూటమి విజయం సాధిస్తుందని, ఆ తర్వాత అన్నాడీఎంకే - బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీలో రెండు రకాల గుర్రాలు
అదే సమయంలో మిత్రపక్షాల్లో ఏ పార్టీకి కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తి లేదన్నారు. ఇటీవల నగరంలో ఏర్పాటైన మీడియా సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రకటనను ప్రసార మాథ్యమాలు వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు. అమిత్ షా రాష్ట్రంలో అన్నాడీఎంకే, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎలాంటి ప్రస్తావనా చేయలేదన్నారు. ‘ఢిల్లీకి మోదీ, తమిళనాడు ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వం వహిస్తారు’ అంటూ అమిత్‌షా స్పష్టమైన ప్రకటన చేశారన్నారు.
తాను కూడా అధికారంలో బీజేపీకి భాగస్వామ్యం కల్పిస్తామంటూ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడమే ఏకైక లక్ష్యంగా భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతామని వెల్లడించారు. ఏయే పార్టీలు అన్నాడీఎంకే కూటమిలో చేరుతాయనే విషయాన్ని ఇప్పటికిప్పుడు ప్రకటించలేనన్నారు. అన్నాడీఎంకే కూటమి బలమైన కూటమా? లేక బలహీనమైన కూటమా? ఎన్నికల ఫలితాల్లో తేలుతుందని, అంతవరకూ డీఎంకే నేత స్టాలిన్ ఓపిక పట్టడం మంచిదన్నారు.
డీఎంకేకు ఎందుకింత కడుపుమంట..
అన్నాడీఎంకే ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా తప్పు పట్టడమే పనిగా పెట్టుకున్న పాలకపక్షమైన డీఎంకే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నందుకు ఓర్వలేక కడుపుమంటతో రగిలిపోతున్నారని ఈపీఎస్ విమర్శించారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే బలమైన పార్టీ అని, మూడు దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అని గుర్తు చేశారు. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకున్నప్పటి నుంచి డీఎంకే పాలకులు భయంతో వణకిపోతున్నారన్నారు.
ముగ్గురు మంత్రులపై అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని రెండు రోజులుపాటు అడుగుతున్నా స్పీకర్ అప్పావు పట్టించుకోకుండా ప్రధాన ప్రతిపక్షంపై నిర్లక్ష్యధోరణిని అవలంభిస్తున్న, పాలకపక్షానికి మద్దతుగానే ఆయన వ్యవహరిస్తున్నారని ఈపీఎస్ ఆరోపించారు. ముగ్గురు మంత్రులపై అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతించని స్పీకర్ తీరును వ్యతిరేకిస్తూ తమ పార్టీ సభ్యులందరూ వాకౌట్ చేసినట్లు ఈపీఎస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News