Share News

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా కూటమిలోనే బీజేపీ ఉంది

ABN , Publish Date - Jul 30 , 2025 | 10:56 AM

‘మా కూటమిలోనే బీజేపీ ఉంది, అదే సమయంలో బీజేపీతో పలు ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల తర్వాత కూటమిపై స్పష్టత వస్తుంది. ఎన్నికలకు మరో 8 నెలలు మాత్రమే ఉన్నందున ఆలోగా మరిన్ని పార్టీలు మా కూటమిలోకి వస్తాయని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) పేర్కొన్నారు.

EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా కూటమిలోనే బీజేపీ ఉంది

- ఎన్నికల సమయంలో మరిన్ని పార్టీలు

- ఈపీఎస్‌ వెల్లడి

చెన్నై: ‘మా కూటమిలోనే బీజేపీ ఉంది, అదే సమయంలో బీజేపీతో పలు ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల తర్వాత కూటమిపై స్పష్టత వస్తుంది. ఎన్నికలకు మరో 8 నెలలు మాత్రమే ఉన్నందున ఆలోగా మరిన్ని పార్టీలు మా కూటమిలోకి వస్తాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) పేర్కొన్నారు. 2026లో అసెంబీ ఎన్నికలను పురస్కరించుకుని అన్నాడీఎంకే ఆధ్వర్యంలో మక్కలై ‘కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో ఈపీఎస్‌ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా మంగళవారం శివగంగ జిల్లాలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు.


నగరం నుంచి విమానంలో తిరుచ్చి చేరుకున్న ఈపీఎస్ కు విమానాశ్రయంలో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈపీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 7న కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభించిన తన పర్యటనకు జనాదరణ లభించిందన్నారు తాము అధికారంలో ఉన్నా, లేకున్నా.. ప్రజల తరుఫున పోరాడేందుకు ముందుంటామన్నారు.


nani1.2.jpg

1976లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారని, ఆ తర్వాత పలుమార్లు కేంద్రంలో అధికారంలో కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించిన డీఎంకే తనకున్న అధికారంతో విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చకుండా విద్యార్థులకు మొండిచెయ్యి చూపించిందని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ప్రస్తుతం అన్నాడీఎంకే ఉందని, అయితే బీజేపీతో పలు ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపాయని, మరో 8 నెలల్లో కూటమిలో చేరిన పార్టీల వివరాలను స్పష్టంగా వెల్లడిస్తామని ఈపీఎస్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2025 | 10:56 AM