Share News

Jammu and Kashmir: కుల్గాంలో హోరాహోరా ఎన్‌కౌంటర్

ABN , Publish Date - Aug 03 , 2025 | 02:58 PM

కుల్గాం జిల్లాలో శనివారం ఇద్దరు టెర్రరిస్టులను కాల్చిచంపిన భద్రతా బలగాలు ఆదివారంనాడు కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తొలుత ఈ ఆపరేషన్ శుక్రవారం సాయంత్రం కుల్గాంలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం మొదలైంది.

Jammu and Kashmir: కుల్గాంలో హోరాహోరా ఎన్‌కౌంటర్
Kulgam Encounter

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని కుల్గాం జిల్లాలో శనివారం ఇద్దరు టెర్రరిస్టులను కాల్చిచంపిన భద్రతా బలగాలు ఆదివారంనాడు కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తొలుత ఈ ఆపరేషన్ శుక్రవారం సాయంత్రం కుల్గాంలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం మొదలైంది.


ఉగ్రవాదులు సంచరిస్తున్న సమాచారం మేరకు అఖల్ ఏరియాలోని అడవుల్లో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టగా, ఉగ్రవాదులు, బలగాల మధ్య స్వల్పంగా కాల్పులు చోటుచేసుకున్నారు. శుక్రవారం రాత్రి అపరేషన్‌ ఆపుచేసి అదనపు బలగాలను రప్పించడంతో తిరిగి శనివారం ఉదయం కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్టుల ఆచూకీ తెలుసుకుని వారిని టార్గెట్ చేసేందుకు డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ డివైజ్‌లను బలగాలు ఉపయోగిస్తున్నాయి.


కుల్గాంలో చేపట్టిన ఆపరేషన్ అఖల్ కొనసాగుతోందని, ఇంతవరకూ ఒక టెర్రరిస్టును బలగాలు మట్టుబెట్టాయని ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

వరదల తాకిడికి వారణాసి-ప్రయాగ్‌రాజ్ అతలాకుతలం.. అఖిలేష్ యాదవ్ ఆగ్రహం

కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. బలైపోయిన 11 మంది, డ్రైవర్ సేఫ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 03:00 PM