Home » Encounter
కుల్గాం జిల్లాలో శనివారం ఇద్దరు టెర్రరిస్టులను కాల్చిచంపిన భద్రతా బలగాలు ఆదివారంనాడు కూడా యాంటీ టెర్రర్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తొలుత ఈ ఆపరేషన్ శుక్రవారం సాయంత్రం కుల్గాంలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం మొదలైంది.
జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన ఆపరేషన్‌లో సైన్యం గొప్ప విజయాన్ని సాధించింది. ఆ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చారు.
పహల్గాం ఉగ్రకుట్ర వెనుక ముసా ప్రధాన సూత్రధారి అని అధికార వర్గాలు వెల్లడించాయి. గతేడాది శ్రీనగర్-సోన్‌మార్గ్ హైవేపై జడ్ మోడ్ టన్నెల్ నిర్మాణంలో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపి ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఘటనలో ముసా ప్రమేయం ఉంది.
మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని, ఘటనా స్థలి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్‌రాజ్ తెలిపారు. వీటిలో INSAS, SLR రైఫిళ్లు కూడా ఉన్నట్టు చెప్పారు.
ఘాగ్రా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో జార్ఖాండ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కూడిన భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఇరువైపులా సుదీర్ఘంగా కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా అబుజ్మద్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతిచెందారు.
Encounter: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రగాయాలపాలైనట్లు తెలుస్తోంది.
Encounter: మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సమయంలో 42 మంది ఉండేవారు. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో సభ్యుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాదే ఎన్‌కౌంటర్లలో నలుగురు మృతి చెందారు. మిగిలిన 16 మందిలో 11 మంది తెలుగువారే కావడం గమనార్హం.
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండ లం సత్యవోలు గ్రామంలో సోమవారం జరగనున్నాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.