Encounter: భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:15 PM
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో మావోయిస్టు మృతదేహాలు, ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ మీడియాకు వెల్లడించారు.
మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న బీజాపూర్, దంతెవాడ, డీఆర్జే, ఎన్టీఎఫ్ సంయుక్త బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలు ఇన్సాస్, స్టెన్గన్లు, 303 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టు కదలికలు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. అదనపు బలగాలను అక్కడికి పంపుతున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ తెలిపారు. మరోవైపు గరియాబంద్ జిల్లాలో నాలుగు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకోగా.. భారీగా ఆయుధ సామగ్రిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇవీ చదవండి:
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
బీహార్ NDA హవా.. సర్వేలన్నీ నితీష్ కుమార్ వైపే.!