Share News

Hidma-Jampanna: హిడ్మాను పోలీసులు పట్టుకొని చంపేశారు.. ABNతో మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న

ABN , Publish Date - Nov 19 , 2025 | 03:20 PM

నిన్న పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు నేత హిడ్మా మృతిపై మావోయిస్ట్ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆయన అన్నారు. పోలీసులు పట్టుకున్న తర్వాత హిడ్మాను కాల్చి చంపారని..

Hidma-Jampanna: హిడ్మాను పోలీసులు పట్టుకొని చంపేశారు.. ABNతో మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న
Jampanna On Hidma Encounter

ఇంటర్నెట్ డెస్క్: పోలీస్ ఎన్‌కౌంటర్లో నిన్న మృతి చెందిన మావోయిస్ట్ నేత హిడ్మాను పోలీసులు పట్టుకొని చంపేశారని మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న ఆరోపించారు. ఈ అంశంపై జంపన్న ఏబీఎన్ తో మాట్లాడారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో తాను 17 ఏళ్ళ పాటు పని చేశానని, మావోయిస్టు పార్టీ ఇప్పుడు పూర్తిగా క్షీణించిందని ఆయన అన్నారు.


భద్రత దళాలకు ఇన్‌ఫార్మార్ వ్యవస్థ గతం కంటే భారీగా పెరిగిందని, మరో వైపు మావోయిస్టులకంటే పోలీసులకు టెక్నాలజీ, అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని జంపన్న చెప్పారు. 'హిడ్మాను పోలీసులు పట్టుకొని చంపేశారు.. ఇది బూటకపు ఎన్‌కౌంటర్. ఎదురు కాల్పులు జరిగినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవు. ఏపీలో ఎవరినైనా చంపాలనుకుంటే అంతమంది మావోయిస్టులు యాక్షన్ చేయరు. ఏదైనా టార్గెట్‌లో యాక్షన్ చేయాలి అంటే ఐదు మందికి మించి ఉండరు. పదుల సంఖ్యలో యాక్షన్ అనేది పార్టీ అనుమతించదు. ఈ ఎపిసోడ్‌లో మధ్యవర్తిత్వం చేసిన వారు మోసం చేసినట్లు కనిపిస్తుంది.' అని జంపన్న వ్యాఖ్యానించారు.


'పార్టీలో హిడ్మా‌కు మంచి గుర్తింపు ఉంది. యాక్షన్ చేయడంలో హిడ్మా దిట్ట. నేను కేంద్ర కమిటీలో ఉన్న సమయంలో పలు సందర్భాల్లో హిడ్మాతో నాకు పరిచయం ఉంది. హిడ్మా యాక్షన్లో ఉన్నాడు అంటే.. సక్సెస్ చేసుకొనే వస్తాడు అనే నమ్మకం పార్టీలో ఉంది. యాక్షన్ చేయాలి అంటే ఒక వ్యక్తి నిర్ణయం ఉండదు. పార్టీ నాయకత్వం నిర్ణయం ప్రకారమే యాక్షన్ చేయాల్సి ఉంటుంది. మావోయిస్టులు అడవుల్లో ఉండి ప్రాణాలు కోల్పోకండి.' అని జంపన్న మావోలకు హితవు పలికారు.


'పోలీసులు ముందు లొంగిపోవడం అవమానకరం ఏమి కాదు.. ప్రజల్లో ఉండి ప్రజలకోసం పోరాటం చేయొచ్చు.. ప్రాణాలతో ఉండడం చాలా ముఖ్యం. హిడ్మా తరువాత మావోయిస్టు పార్టీ కనుమరుగైందనేది నేను నమ్మను. ఇక కేంద్ర కమిటీలో దేవ్ జీ , గణపతి, పల్లా రాజిరెడ్డి, గణేష్, సాగర్, జనార్దన్ తోపాటు ఇంకా కేంద్ర కమిటీలో ఉన్నారు. ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, బీహార్, మధ్య ప్రదేశ్‌లో ఇంకా మావోయిస్టులు సాయుధ పోరాటం చేస్తున్నారు.' అని జంపన్న ఆంధ్రజ్యోతితో తన అభిప్రాయాల్ని పంచుకున్నారు.


ఇవి కూడా చదవండి..

ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..

టీవీకే సభ్యులకు క్యూ ఆర్‌ కోడ్‌తో గుర్తింపు కార్డులు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 19 , 2025 | 04:16 PM