Net Worth : కుప్పకూలిన టెస్లా షేరు..మస్క్ సంపదలో 1.93 లక్షల కోట్లు ఆవిరి
ABN , Publish Date - Feb 27 , 2025 | 06:23 AM
టెస్లా అధిపతి మస్క్ సంపదకు భారీగా గండిపడింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం....

న్యూయార్క్: టెస్లా అధిపతి మస్క్ సంపదకు భారీగా గండిపడింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మస్క్ నెట్‌వర్త్ మంగళవారం ఒక్కరోజే 2,220 కోట్ల డాలర్లు (రూ.1.93 లక్షల కోట్లు) క్షీణించి 35,800 కోట్ల డాలర్లకు(రూ.31.14 లక్షల కోట్లు) పడిపోయింది. గత నెల యూరప్ మార్కెట్లో టెస్లా కార్ల విక్రయాలు 45ు క్షీణించడమే ఇందుకు కారణం. దీంతో టెస్లా షేరు ధర మంగళవారం ట్రేడింగ్‌లో ఏకంగా 8.39 శాతం క్షీణించి 302.80 డాలర్లకు పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) లక్ష కోట్ల డాలర్ల దిగువకు పడిపోయి.. 94,800 కోట్ల డాలర్లకు (రూ.82.47లక్షల కోట్లు) పరిమితమైంది. ఇక, మస్క్ నెట్‌వర్త్ ఈ ఏడాదిలో 7,450 కోట్ల డాలర్ల (రూ.6.48 లక్షల కోట్లు) మేర తరిగిపోగా.. గత డిసెంబరు 16 నాటికి రికార్డు స్థాయితో పోలిస్తే 10,000 కోట్ల డాలర్ల (రూ.8.70 లక్షల కోట్లు)కు పైగా తగ్గింది.