Bihar Voter List: బిహార్ ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:36 PM
ముసాయిదా జాబితా పబ్లిష్ కావడంతో 'క్లెయిమ్స్, అబ్జెక్షన్ల' సమయం మొదలైంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు చేసుకునేందుకు గడువు విధించారు. తమ పేర్లు పొరపాటున జాబితాలో చోటుచేసుకోని పక్షంలో దానిని సరిచేయాల్సిందిగా అధికారులను ఓటర్లు సంప్రదించవచ్చు.

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నేపథ్యంలో కీలకమైన ముసాయిదా జాబితా (Draft Electoral Rolls)ను ఎన్నికల కమిషన్ (Election Commission) శుక్రవారంనాడు విడుదల చేసింది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90,817 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితా ఇది. మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో రాష్ట్రంలోని 38 జిల్లాల కలెక్టర్లు ముసాయిదా జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేశారు. ఫిర్యాదుల జాబితా అందుబాటులో లేనప్పటికీ, ఓటర్లు తమ పేర్లను ఈసీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
ముసాయిదా జాబితా పబ్లిష్ కావడంతో 'క్లెయిమ్స్, అబ్జెక్షన్ల' సమయం మొదలైంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు చేసుకునేందుకు గడువు విధించారు. తమ పేర్లు పొరపాటున జాబితాలో చోటుచేసుకోని పక్షంలో దానిని సరిచేయాల్సిందిగా అధికారులను ఓటర్లు సంప్రదించవచ్చు. ఇది రాజకీయ పార్టీలకు, ఎన్నికల కమిషన్‌కూ కూడా కీలక దశగా చెప్పుకోవచ్చు.
ఈసీ ఇటీవల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వచ్చింది. రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని, 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారినట్టు తెలిపింది. మరో 7 లక్షల మంది రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నట్టు కూడా అధికారుల పరిశీలనలో తేలింది. కాగా, ఉద్దేశపూర్వకంగానే ఓటర్లను తొలగిస్తున్నారంటూ విపక్షాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
ఇవి కూడా చదవండి..
అత్యాచారం కేసులో మాజీ ఎంపీ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి