India Vice President Election : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల..
ABN , Publish Date - Aug 01 , 2025 | 01:45 PM
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ ఉండనున్నట్లు తెలిపింది.

ఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ ఉండనున్నట్లు తెలిపింది. ఆగస్టు 7వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానున్నట్లు స్పష్టం చేసింది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 21వ తేదీని ఎన్నికల సంఘం ఖరారు చేసింది.
స్వీకరించిన నామినేషన్ల పరిశీలన 22వ తేదీన జరుగుతుంది. ఆగస్టు 25వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చుని పేర్కొంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది.
జులై 22న జగదీప్ ధన్కర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.ఆయన ఆరోగ్య కారణాల తన పదవికి రాజీనామ చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామను అందించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..
ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి