Nita Ambani - Donald Trump: ట్రంప్ డిన్నర్‌లో నీతా అంబానీ కట్టిన చీర ప్రత్యేకతలు ఇవే..
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:57 PM
Nita Ambani - Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డిన్నర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తళుక్కున మెరిశారు. భారత సంప్రదాయంలో కాంచీపురం చీరను ధరించారు. ఈ చీర ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకొంది. అలాగే శతాబ్దాల క్రితం నాటి అత్యంత విలువైన ఆభారణాలను సైతం ఆమె ధరించారు.

వాషింగ్టన్, జనవరి 20: మరికొన్ని గంటల్లో అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశ విదేశాల నుంచి అతిరథమహారధులు వాషింగ్టన్‌కు తరలి వచ్చారు. సోమవారం వారి కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌కు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీతోపాటు ఆయన భార్య నీతా అంబానీ హాజరయ్యారు. అయితే ఈ డిన్నర్‌లో నీతా అంబానీ ధరించిన చీర అందరిని ఆకర్షించింది.
కాంచీపురం నేతతో నలుపు రంగు చీరలో నీతా అంబానీ మెరిసి పోయారు. అలాగే బ్లాక్ కలర్ ఫ్లవర్ బ్లౌజ్‌తోపాటు శతాబ్దాల నాటి ఆభరణాలను సైతం ఆమె ధరించారు. ప్రముఖ కళాకారుడు బి. కృష్ణమూర్తి ఈ చీరను నేశారు. అలాగే బ్లౌజ్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. చెవులు, మెడ, చేతికి పచ్చని పూసలు, రాళ్లతో పొదిగిన ఆభరణాలను ఆమె ధరించారు.
అలాగే చేతి మణికట్టుకు సైతం పచ్చని రాయితో చేసిన ఆభరణాన్ని ధరించి.. ఈ డిన్నర్‌లోనే నీతా అంబానీ మెరిసిపోయారు. మొత్తం స్వదేశీ వస్తువులను ఇలా ధరించడం ద్వారా నీతా అంబానీ భారత్‌పై ఉన్న తన అనుబంధాన్ని మరింత ధృడపరుచుకొన్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనవరి 18వ తేదీన ముఖేష్ అంబానీ దంపతులు యూఎస్ చేరుకున్నారు. అనంతరం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఆయన్ని కలిసి.. ఈ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. కొత్త దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతోన్న ట్రంప్ సారథ్యంలో భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయని ముఖేష్ అంబానీ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: కోల్‌కతా వైద్య విద్యార్థిపై హత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు
భారతీయ కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 10.30 గంటలకు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం.. క్యాపిటల్ సెప్ట్స్ మీద జరుగుతాయి. కానీ ఈ సారి మాత్రం క్యాపిటల్ రోటుండాలో జరగనున్నాయి. వాతావరణం అతి శీతలంగా ఉండడంతో.. క్యాపిటల్ రోటుండాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత క్యాపిటల్ రోటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టనున్నారు. గతంలో అంటే.. 1985లో రోనాల్డ్ రీగన్...క్యాపిటల్ రోటుండాలో దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విధితమే.
For National News And Telugu News